పరీక్షలు వద్దు ప్రమోట్ చేయండి :రాహుల్ గాంధీ

111

కోవిడ్ మహమ్మారి వణికిస్తున్న తరుణంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం అనుచితమని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. పరీక్షలు రద్దు చేసి, విద్యార్థుల గత ప్రతిభ ఆధారంగా వారిని ప్రమోట్ చేయాలని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని కోరారు. విద్యార్థులు, విద్యావేత్తల అభిప్రాయాలను యూజీసీ తప్పనిసరిగా వినాలని ఓ ట్వీట్‌లో రాహుల్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘స్పీక్ అప్ స్టూడెంట్స్’ ప్రచారంలో రాహుల్ పాల్గొంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక చిన్న వీడియోను కూడా ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

‘కోవిడ్‌తో ప్రజలెంతో నష్ట పోయారు. స్కూళ్లు, పాఠశాలలు, యూనివర్శిటీ విద్యార్థులు కూడా ఇబ్బందులకు గురయ్యారు.

ఐఐటీలు, కాలేజీల్లో పరీక్షలు రద్దు చేసి, స్టూడెంట్లను ప్రమోట్ చేశారు. యూజీసీ మాత్రం గందరగోళం సృష్టిస్తోంది. యూజీసీ కూడా పరీక్షలు రద్దు చేసి, వారికి వచ్చిన గత మార్కుల ఆధారంగా విద్యార్థులను ప్రమోట్ చేయాలి’ అని ఆ వీడియో సందేశంలో రాహుల్ అన్నారు. సెప్టెంబర్‌ నెలాఖరులో అన్ని ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రకటించిందన్న వార్తల నేపథ్యంలో రాహుల్ తాజా ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here