పడవ ప్రమాద ఘటనపై జగన్‌ తీవ్ర విచారం!

126

పడవ ప్రమాద ఘటనపై వైఎస్‌ జగన్‌ తీవ్ర విచారం.పార్టీ తరఫున కమిటీని ఏర్పాటుచేసిన వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు ఘటనపై వివరాలు తెలుసుకోవడంతోపాటు, బాధితులకు సహాయం అందేలా చూడాలని పార్టీ నాయకులకు ఆదేశం.

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు, ప్రజాసంకల్పయాత్ర శిబిరం నుంచి: –తూర్పుగోదావరిజిల్లా దేవీపట్నం సమీపంలో పడవ ప్రమాద ఘటనపై పార్టీ తరఫున కమిటీని ఏర్పాటుచేసిన వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌
–కమిటీలో మాజీ మంత్రి ధర్మాన, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఆళ్లనాని, మాజీ ఎమ్మెల్యే బాలరాజు, జక్కంపూడి విజయలక్ష్మి , తూర్పుగోదావరి జిల్లా వైయస్సార్‌సీపీ యువజన నాయకులు అనంత్‌ ఉదయ్‌భాస్కర్‌
–ప్రమాద ఘటనకు కారణాలు తెలుసుకోవాలన్న వైయస్‌ జగన్‌
బాధితులకు అండగా ఉంటూ, ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూడాలని పార్టీ నాయకులను జగన్‌ ఆదేశం
–తరచుగా బోటు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? గతంలో జరిగిన ఘటనల కారణాలు ఏంటి? ప్రభుత్వం ఎందుకు ఈ ప్రమాదాలను నియంత్రించలేకపోతోంది? తదితర అంశాలపై వివరాలు తెలుసుకోవాలన్న వైఎస్‌ జగన్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here