న‌ర్సాపురం రాజు వెనుక విజ‌య‌సాయిరెడ్డి?

126

న‌ర్సాపురం వైకాపా ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు క‌ల‌క‌లం రేపే వ్యాఖ్య‌లు చేయ‌డం వెనుక వున్న‌ది విజ‌య‌సాయిరెడ్డేన‌ని వైఎస్సార్సీపీ అధిష్టానానికి స్ప‌ష్ట‌మైపోయింది. ర‌ఘురామ‌కృష్ణంరాజుని పార్టీలోకి తీసుకొచ్చింది విజ‌యసాయిరెడ్డే. విజ‌య‌సాయిరెడ్డికి పార్టీలో నెంబ‌ర్ 2 పొజిష‌న్ లాక్కోవ‌డం, విశాఖ‌, ఢిల్లీ బాధ్య‌త‌లు త‌ప్పించ‌డంతోపాటు ఆయ‌న మ‌నుషుల్ని సైడ్ చేస్తూ వ‌చ్చారు. కేవ‌లం విజ‌య‌సాయిరెడ్డి మ‌నిష‌నే కార‌ణంగానే ర‌ఘురామ‌కృష్ణంరాజుకి జ‌గ‌న్‌రెడ్డి అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డంలేదు. దీంతో విజ‌యసాయిరెడ్డి ఢిల్లీలో బీజేపీ పెద్ద‌ల‌తో మిలాఖ‌త్ అయి జ‌గ‌న్‌రెడ్డికి ఝ‌ల‌క్ ఇచ్చేందుకు ర‌ఘురామ‌కృష్ణంరాజుని ముందుగా రంగంలోకి దింపార‌ని స‌మాచారం. పార్టీలు మార‌డం రాజుగారికి కొత్త కాక‌పోయినా, ఎన్నిక‌ల స‌మ‌యంలో విచిత్రంగా బిహేవ్ చేసిన రాజుగారు ఎంపీ అయ్యాక చాలా ప‌రిప‌క్వంగా, చాలా కాన్ఫిడెంట్‌గా, క్రిస్ట‌ల్ క్లియ‌ర్‌గా త‌న అభిప్రాయాల‌ను బ‌య‌ట‌పెడుతున్నారు. ఈ రోజు త‌నపై ఆరోప‌ణ‌లు చేసిన ఎమ్మెల్యేలు, మంత్రికి ఇచ్చి కౌంట‌ర్‌తో వైకాపాలో ప్ర‌కంప‌న‌లు ప్రారంభం అయ్యాయి. ఎంపీ ఒంటరిగా లేడ‌ని, ఢిల్లీ పెద్ద‌ల ఆశీస్సుల‌తోపాటు విజ‌య‌సాయిరెడ్డి వెనుకుండి అంతా చేయిస్తున్నార‌నేది పూర్తిగా నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన కోట‌రీ పెద్ద‌లు ..ఎంపీపై వేటు వేస్తే విజ‌య‌సాయిరెడ్డి సెట్ అయిపోతాడ‌నే దిశ‌గా చ‌ర్య‌ల‌కు దిగబోతున్నార‌ని స‌మాచారం.

Note -; Watsapp forward

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here