న‌య‌న మ‌నోహ‌రం…భ‌క్తుల కోలాహ‌లం..!

విజ‌య‌వాడ‌లోని సీత‌మ్మ వారి పాదాలు ఎదుట ఉన్న శ్రీ దుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామి వార్ల ద‌త్త‌త దేవాల‌యం అయిన శ్రీ శ‌నైశ్చ‌ర స్వామి దేవాల‌యంలో శ‌నైశ్చ‌ర‌స్వామి వారి జ‌యంతి వేడుక‌లు మంగ‌ళ‌వారం వైభ‌వంగా జ‌రిగాయి. తెల్ల‌వారుజాము నుంచే భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చి స్వామివారికి తైలాభిషేకం, వివిధ పండ్ల ర‌కాల‌తో అభిషేకాలు, ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆల‌యం త‌ర‌ఫున శ‌నైశ్చ‌ర స్వామి వారికి తైలాభిషేకం, పూజాధికాలు నిర్వ‌హించి ఆభ‌ర‌ణాల‌తో ప్ర‌త్యేక అలంక‌ర‌ణ చేశారు. శ‌నైశ్చ‌ర‌స్వామి, జేష్టాదేవి ఉత్స‌వ విగ్ర‌హాలు ప్ర‌తిష్టించి ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు తూటుప‌ల్లి శ్రీమ‌న్నారాయ‌ణ‌మూర్తి ఆధ్వ‌ర్యంలో శాస్త్రోక్త‌కంగా అష్టోత్త‌ర క‌ల‌శ పూజ‌లు నిర్వ‌హించారు. పులిహోర‌, చ‌క్ర‌పొంగ‌లి, కేస‌రి, పంచామృతాల‌ను స్వామివారికి నైవేద్యంగా స‌మ‌ర్పించారు. శ‌నైశ్చ‌ర స్వామి జ‌యంతిని సంద‌ర్భంగా శ్రీ శ‌నైశ్చ‌ర స్వామి వారి భ‌క్త బృందం ఆధ్వ‌ర్యంలో స్వామివారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం గురుస్వామి మాదాల పాండురంగారావు ఆధ్వ‌ర్యంలో భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాన్ని ఏర్పాటు చేశారు. కార్య‌క్ర‌మంలో శ‌నైశ్చ‌ర స్వామి భ‌క్త బృందం స‌భ్యులు కొల్లా వెంక‌ట బుజంగ‌రావు, కె.స‌త్య‌నారాయ‌ణ‌, సీహెచ్ నాగ‌ల‌క్ష్మీ, మ‌ల్లికార్జున బాబూజీ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *