నైపుణ్యాభివృధ్ధికి పెద్దపీట —మంత్రి కొల్లు రవీంద్ర 

నైపుణ్యాభివృధ్ధికి పభుత్వం పెద్దపీట వేసి , యువతకు ఉపాధి అవకాశాలు పెంపోందించేం దుకు కృత నిర్చయంతో ఉందని రాష్ట్ర న్యాయ, క్రీడలు,  యువజన సర్వీసుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణ జిల్లా మచిలీపట్నం మండలం తాళ్ళపాలెం డిపి పౌండేషన్ తరంగిణి మాత చర్చి ప్రాంగణంలో కొల్లు పౌండేషన్ ఆద్వర్యంలో  ఉచిత కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా పాల్గోన్నారు.ఈ సందర్బంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు పెంపోందించడం కోసం తమ ప్రభుత్వం అనేక రకాల శిక్షణ కార్యక్రమాలకు రూపకల్పన చేసి నైపుణ్యాభివృధ్ధి శిక్షణనిస్తుదన్నారు. యువత సామర్ధ్యాన్ని బట్టి ఆయా రంగాలలో శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు పెంపోంచటం జరుగుతుందన్నారు. ఇందుకోసం వేరు వేరు రంగాలకు చెందిన సంస్థలను బాగస్వాములను చేస్తున్నామని, ప్రతి ఇంటిలోను కుటుంబసభ్యుల ఆదాయం పెంచటం ద్వారా మెరుగైన జీవనాన్ని అందించటం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయమని తెలియజేశారు. డిపి పౌండేషన్ ప్రాంగణంలో తమ తల్లిదండ్రుల గుర్తుగా ఎర్పాటు చేసిన కొల్లు పౌండేషన్ సహాకారంతో మద్యంతరంగా చదువు ఆపేసిన ఆడపిల్లలకు కుట్టుశిక్షణ అందించామని అన్నారు. భవిష్యత్తులో తమ కాళ్ళపై తాము ఆర్ధికంగా నిలదోక్కుకోనేందుకు ఉచితంగా కుట్టుమిషన్లు అందించటమే కాక, కోందరికి స్పోకెన్ ఇంగ్లీషు,కంప్యూటర్ శిక్షణ ఇవ్వటం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయా రంగాలలో శిక్షణ పోందిన పలువురు బాలికలు ఈశిక్షణ ద్వారా తాము సాధించిన ప్రగతిని, తమ అనుభవాలను పంచుకున్నారు.ఈసభలో డిపి పౌండేషన్ పాధర్ జాకబ్ వడయార్, స్థానిక జడ్ పి టి సి లంకే నారాయణ ప్రసాద్ , యం పి టి సి నాగమల్లేశ్వరరావు, ఆసుపత్రి కమిటీ చైర్మన్ తలారి సోమశేఖర్ ,కుంచే నానీ ,వాలిసెట్టి తిరుమలరావు తదితర నాయకులు, పలువురు లబ్ధిదారులు,స్థానికులు పాల్గోన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *