నేను ఎవరికీ భయపడను..అవసరమైతే జైలుకెళ్తా: జయదేవ్‌

78

‘నేను ఎవరికీ భయపడను…, అవసరమైతే జైలుకెళతా’నని గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ అన్నారు. ఆదివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుజరాత్‌ రాజకీయాన్ని దేశం మొత్తం రుద్దాలని మోదీ యత్నిస్తున్నారని, జగన్‌, కేసీఆర్‌తో కలిసి మోదీ కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పుడు వీరి ముగ్గురి దృష్టి ఇప్పుడు నాపై పడిందని, బడ్జెట్‌ స్పీచ్‌ అనంతరం నాకు ఈడీ నోటీసులు ఇచ్చారని జయదేవ్ అన్నారు. ‘నేను పక్కాగా ట్యాక్స్‌ కడుతున్నా.. నా వద్ద ఏమీ దొరకలేదు.., నా బంధువులు, స్నేహితులనూ ఐటీ అధికారుల వేధిస్తున్నారు’ అని గల్లా అన్నారు. ఏపీలో టీడీపీ గెలుపుకోసం దేశం ఎదురుచూస్తోందని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here