నా విశ్వరూపం చూపిస్తా: బాలకృష్ణ వార్నింగ్

47

మీరు తీరు మార్చుకోకుంటే తాట తీస్తానని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయిందని, ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే సహించేది లేదని చిలమత్తూరు మండల టీడీపీ నేతలకు ఆయన హెచ్చరికలు జారీ చేశారు. హిందూపురంలో చిలమత్తూరు మండలం నేతలతో పంచాయతీల వారీగా ఆయన సమావేశమయ్యారు.

ఇక పని మొదలు, ప్లానే కాదు నిర్మాణంలోను సింగపూర్: బాబు, ఈ ఒప్పందంతో ఏపీకి నష్టమని ఆందోళన

ఈ సందర్భంగా గత నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధి పనులు, పెండింగ్ పనుల గురించి నేతలు బాలకృష్ణకు వివరించారు. పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఉన్నా తమకు సరైన గుర్తింపు లభించడం లేదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు.

అభివృద్ధి పనులను కొందరే పంచుకుంటున్నారని, కార్యకర్తల మంచిచెడ్డలు పట్టించుకోవడం లేదని వారు ఫిర్యాదు చేశారు. దీంతో బాలకృష్ణ స్పందించారు.

విశ్వరూపం
నా విశ్వరూపం చూస్తారు
ఇకపై క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారిస్తానని బాలకృష్ణ చెప్పారు. ఇప్పటి వరకు జరిగిపోయినదాన్ని నేతలు, కార్యకర్తలు మరచిపోవాలని, ఇకపై అందరూ కలసి పని చేయాలన్నారు. లేకపోతే తన విశ్వరూపం చూస్తారని హెచ్చరించారు. పార్టీకి చెడ్డ పేరు తీసుకురాకుండా పని చేయాలని సూచించారు. లేదంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here