నాయకుల్లో భయం..జనంలో సందడి..!

126

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు పూర్తిస్థాయిలో మొదలైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని బదిలీ చేసి కొత్త సీఈఓగా గోపాల కృష్ణ ద్వివేదిని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని, మార్చి నెల రెండోవారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తారని తెలుస్తోంది. రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కు, షెడ్యూల్ కు మధ్య ఒకే రాష్ట్రానికి సంబంధించినది అయితే ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం 21రోజులు వ్యవధి ఉంటుంది. అయితే ఒక రాష్ట్రానికంటే మించి, పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ కు షెడ్యూల్ కు మధ్య 50రోజులు వ్యవధి ఉండే వీలుంది. 2016లో సుప్రీంకోర్ట్ కు ఓ కేసు విషయమై నోటిఫికేషన్ కు షెడ్యూల్ కు మధ్య ఎంత సమయం ఉండాలన్న విషయంలో ఎలక్షన్ కమిషన్ ఈ వివరాలను తెలియపరిచింది. దీన్నిబట్టి ఫిబ్రవరి మొదటివారం నోటిఫికేషన్ జారీచేస్తే, మార్చి రెండోవారంలో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌‌ ప్రదేశ్‌ల‌లో అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి. జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలతో నిర్వహించడంపై ఈసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అసెంబ్లీ ఎన్నికలతోపాటు, లోక్ సభ ఎన్నికలు కూడా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here