నాగార్జున కు బట్టతల ఎందుకు రాలేదో తెలుసా ?

90

ఒక ఇంట్లో తాతకో, తండ్రికో బట్టతల ఉంటే కొడుకులకి కూడా బట్టతల రావడం ఖాయమంటారు. చాలా మందిని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. అదంతా జీన్స్ మహత్యం.అక్కినేని నాగేశ్వరరావు కి బట్టతల ఉంది. ఆయన పెద్దబ్బాయి వెంకట్ అక్కినేనికి బట్టతల ఉంది. మరి ఆయన రెండో కొడుకు అక్కినేని నాగార్జునకి బట్టతల రాలేదు ఎందుకని? నాగార్జున టాప్ హీరో కాబట్టి హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఏమైనా చేయించు కున్నారా ? ఈ విషయాన్ని నాగార్జునని అడిగితే ఆయన అసలు నిజం చెప్పుకొచ్చారు.అదేమిటంటే – నాగార్జున కి కూడా 28 ఏళ్ల వయసులో జుట్టు పలచబడం మొదలయ్యిందట. నాన్న, అన్నకు లాగానే తనకూ బట్టతల వచేస్తుందేమోనని తెగ భయపడిపోయారట నాగ్. సరిగ్గా అదే టైమ్ లో కేరళ లో దొరికే ఆయుర్వేద తైలం గురించి చెప్పాడట. ఆ తైలం ఖరీదు 80 రూపాయలు మాత్రమే. వెంటనే నాగ్ తన పర్సనల్ కాస్ట్యూమర్ శేఖర్ ని కేరళ పంపించేసాడట. అయితే అక్కడ ఆ తైలాన్ని ఒక్కొక్కరికి ఒక్కో బాటిల్ ఇస్తారట. కానీ కొంతమంది 500 రూపాయలకు బ్లాక్ లో అమ్ముతుంటారట. ఆలా ఆరు నెలలకు సరిపడా బాటిల్స్ తెచ్చేసాడట. ఆ తైలం రాయడం మొదలు పెట్టిన తర్వాత కొత్త జుట్టు వచ్చిందట. అప్పుడు వచ్చిన జుట్టు ఇప్పటికి ఊడ లేదట. అదండీ ,,, నాగార్జున నిగనిగలాడే కురుల వెనుక ఉన్న రహస్యం……!!!! 🙂

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here