జనవరి 1 నుంచి తలసేమియా రోగులకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వనున్నట్టు ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు.ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని పనిచేస్తున్నామని పేర్కొన్నారు.రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా కొత్త పథకం తీసుకు వస్తామన్నారు.2 వేల రోగాలకు ఆరోగ్యశ్రీని విస్తరిస్తూ నిర్ణయం తీసుకుంటామన్నారు. జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామని జగన్ వెల్లడించారు.ఏప్రిల్ నాటికి 1060 అంబులెన్స్‌లు కొనుగోలు చేస్తామన్నారు.డిసెంబర్ 15 నాటికి 510 రకాల మందులు అందుబాటులోకి తెస్తామన్నారు.3 నెలల్లో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామని జగన్ పేర్కొన్నారు.మే నాటికి ఆస్పత్రుల్లో ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. తనకు సంబంధం లేని అంశాలను పెద్దవిగా చేసి చూపుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా గట్టిగా నిలబడతానని జగన్ పేర్కొన్నారు.దేవుడి దయ, ప్రజల దీవెనలు తనకు ఉన్నాయన్నారు. మొదటి నుంచి ప్రజలను, దేవుడిని నమ్మానని సీఎం జగన్ పేర్కొన్నారు.