నవ్వించే వింతలు

37

వినోదాత్మక చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతూనే వుంటారు. వినోదానికి తోడుగా కాస్త సందేశం ఇస్తే.. ఆ బొమ్మ బాక్సాఫీస్ వద్ద హిట్టయినట్టే. అందుకే దర్శకులు.. నిర్మాతలు వినోదభరితమైన చిత్రాలను నిర్మించడానికే మొగ్గు చూపుతుంటారు. అలాంటి కోవలోకి చెందినదే నందు హీరోగా నటించిన ‘వింతలో ఎన్నెన్ని వింతలో..’. ఈ చిత్రంలో నందు సరసన సౌమ్య వేణుగోపాల్ నటించింది. ఈ చిత్రం ఈనెల 6వ తేదీన ప్రేక్షకులను పలకరించనుంది. ముందుగా మీడియాకు సినిమాను ప్రీమియర్ షో వేసింది చిత్ర బృందం. సినిమా బాగా వచ్చిందనే కాన్ఫిడెంట్ తోనే ఈ సినిమాను ముందుగా వేసినట్టు నిర్మాతలు చెప్పారు. మరి ఈ వినోదాత్మక చిత్రం ఏ విధంగా నవ్వించిందో చూద్దాం పదండి.
ఇందులో స్టోరీ గురించి చెప్పాల్సి వస్తే… ఇది నలుగురు కుర్రాళ్ల కథ. వారి జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి. వాటి నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు అనేది టూకీగా చెప్పుకోవచ్చు. కాస్త వివరంగా చెప్పాల్సి వస్తే… విష్ణు(నందు) అనే ఓ మధ్యతరగతి కుర్రాడు… తను ప్రేమించిన అమ్మాయి వందన(సౌమ్య వేణుగోపాల్)ను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుంటాడు. ఇంతలో తన మిత్రలు ఇంకా మ్యారేజ్ కి చాలా టైం వుందని పార్టీ ఇవ్వాలని విష్ణుని కోరుతారు. దాంతో నలుగురు ఓ బార్ కెళ్లి పార్టీ చేసుకుంటారు. అక్కడ తారా(పూజా రామచంద్రన్) వీరికి తారసపడుతుంది. తన లవర్(గగన్ విహార్)తో కలిసి బార్లో వుంటుంది. అయితే నందు బ్యాచ్ లో ఒకరైన(నరసింహా) ఆమెకు సైట్ కొట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంతలో ఆమెనే వచ్చి.. నరసింహాను వాష్ రూమ్ కి తీసుకెళుతుంది. నన్ను కావాలనుకుంటే… అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లాలని కండీషన్ పెడుతుంది. దాంతో ఆమెతో పాటు నలుగురు వెళతారు. కట్ చేస్తే… తెల్లారేసరికి నలుగురు చెరో దిక్కుల విడిపోయి వుంటారు. ఇంతకు ఆ రాత్రి ఏమి జరిగింది? విడిపోయిన నలుగురు మళ్లీ కలిశారా? విష్ణు తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడా? అందుకు విష్ణు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? వాటి నుంచి బయటపడి తన ప్రియురాలిని ఎలా దక్కించుకున్నాడనేదే మిగతా కథ.
సినిమా గురించి విశ్లేషించాల్సి వస్తే… ఉద్యోగం లేకుండా తిరుగుతూ.. తమకు తోచిన విధంగా వుండే కుర్రాళ్ల కథలు ఇంతకు ముందు చాలా చూసే వుంటాం. అయితే ఈ సినిమా మాత్రం కాస్త ఆలోచింపజేస్తుంది. కొన్ని మాటలు మనసును కదిలిస్తాయి. ఆలోచింపజేసేలా చేస్తాయి. అందుకే ఇందులో మేసే వుందనేది. దాంతో పాటు వైవిధ్యమైన స్క్రీన్ ప్లే తో ఆద్యంతం సినిమాను వినోదాత్మకంగా తీర్చిదిద్దాడు దర్శకుడు వరప్రసాద్. నలుగురి పాత్రలూ.. నాలుగు విధాలుగా డిజైన్ చేసుకుని తెరకెక్కించిన విధానం ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్ తరువాత అసలు కథ మొదలవుతుంది. నందు ప్రేమ వ్యవహారం.. అతని మిత్రుల నేపథ్యం… తదితర అంశాలన్నీ ఓ వైవిధ్యమైన స్క్రీన్ ప్లేతో వెండితెరపై చూపించారు దర్శకుడు. అలాగే క్లైమాక్స్ ను కూడా ఓ ఫన్నీ సీన్ తో ముగించడం చాలా బాగుంది. ఓవరాల్ గా రెండు గంటల పాటు ఆహ్లాదకరమైన వినోదాన్ని అందిస్తుంది ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’.
నందు మరోసారి హీరోగా మెప్పించారు. ఓ వైవిధ్యమైన పాత్రతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ ప్రేమను పొందడంలోగానీ… తోటి మిత్రులకు సహాయం చేయడంలో అతని పాత్రకు వున్న ఇంపార్టెన్స్.. దానిని నందు క్యారీ చేసిన విధానం ఇంప్రెస్సివ్ గా వుంది. అతనికి జోడీగా నటించిన సౌమ్య వేణుగోపాల్ హోమ్లీగా కనిపించి మెప్పించింది. ఇక నందు ఫ్రెండ్స్ గా నటించిన నరసింహా తదితరులు కూడా బాగా ఆకట్టుకున్నారు. ముగ్గురి పాత్రలు మెప్పిస్తాయి. వారితో పండించిన వినోదం కడుపుబ్బ నవ్విస్తుంది. అలానే గగన్ విహార్ విలన్ పాత్రతో మెప్పించారు. అతనికి జంటగా నటించిన పూజా రామచంద్రన్ కూడా తారా పాత్రలో హాట్ గా కనిపించి యూత్ ను ఆకట్టుకోవడానికి ట్రై చేసింది. ఇక మిగతా పాత్రలన్నీ తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.
దర్శకుడు వరప్రసాద్ వరికూటి కొత్తవారైనా ఓ వైవిధ్యమైన కథ.. కథనంతో మూవీని తెరకెక్కించిన విధానం బాగుంది. ప్రేక్షకుల్ని ఆద్యంతం నవ్వించేందుకు ట్రై చేయడం బాగుంది. నలుగురి మిత్రుల కథను.. వారి పాత్ర తాలూకు పాత్ర చిత్రణను తెరమీద చూపించిన విధానం బాగుంది. అలానే ఈ చిత్రానికి నేపథ్య సంగీతం బాగుంది. పాటలు బాగున్నాయి. లిరిక్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ రిచ్ గా వున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా నిర్మాణంలో నిర్మాతలు బాగా కేర్ తీసుకున్నారు. సినిమాలో ప్రతి క్యారెక్టర్ కూ.. సన్నివేషాలకు కన్ క్లూజన్ ఇచ్చేలా జాగ్రత్తపడ్డారు. దాంతో సినిమా చూసిన ప్రతి ఒక్కరికి నచ్చుతుంది.
తారాగణం: నందు, సౌమ్య వేణుగోపాల్, పూజారామచంద్రన్, గగన్ విహారి, ఆర్ కె, మీనా, నరసింహా తదితరులు
సంగీతం: యాజమాన్య
నిర్మాతలు: ఎస్ శ్రీకాంత్ రెడ్డి, రామమోహన రావు ఇప్పిలి
దర్శకత్వం : వర ప్రసాద్ వరకూటి
రేటింగ్: 3

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here