నవ్వాంధ్ర కోసమే నవనిర్మాణ దీక్ష

47

నవ్వాంధ్ర నూతన నిర్మాణం కోసమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్ష చేపట్టారని ఏపి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉధ్ఘాటించారు. నవ నిర్మాణ దీక్షలలో భాగంగా శుక్రవారం ఇబ్రహీంపట్నం, రాయనపాడులలో జరిగిన తుది దీక్షా సభలలో ఆయన ప్రసంగించారు. మైలవరం నియోజకవర్గంలో తొమ్మిదేళ్ళపాటు నోటికొచ్చిట్లు నన్ను దుర్భాషలాడిన నాయకుడు మరో నాయకునితో బేరమాడుకుని కోట్ల రూపాయలు సంచిలో పెట్టుకుని వెళ్ళిపోయాడని తెలిపారు. జగన్ కేసులో ఎ7 ముద్దాయిగా ఉన్న కొత్త నాయకుడు డబ్బులు దండిగా పట్టుకుని నన్ను తిడుతూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వస్తున్నట్లు విమర్శించారు. ఈ కొత్త నాయకుడికి పార్టీలు మారటం తప్ప మైలవరం నియోజకవర్గ హద్దులు, సరిహద్దులు తెలియవని ఎద్దేవా చేసారు. రాష్ర్టంలో ఇప్పటి వరకు చంద్రన్న భీమా క్రింద 2వేల కోట్లు చెల్లించినట్లు తెలిపారు. 15వేల కి.మీ సీసీ రోడ్లు వేసామని అన్నారు. మైలవరం నియోజకవర్గంలో 40ఏళ్ళుగా పరిష్కారం కాని 7082 ఇళ్ళకు పట్టాలిచ్చామని, వీటి విలువ రూ.10 లక్షల నుండి రూ.25లక్షలు ఉంటుందని తెలిపారు. మరో 3వేల పట్టాలు త్వరలో ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇబ్రహీంపట్నంలో 20 ఎకరాల్లో రూ.5వందల కోట్లతో ఎయిమ్స్ ఆసుపత్రి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. సీఎంఆర్ఎఫ్ క్రింద 267 మంది లబ్ధిదారులకు రూ.1,29,16,754/-లు మంజూరైనట్లు తెలిపారు. గతంలో పింఛన్లు, సబ్సీడీ బియ్యం పథకాలను పందికొక్కుల్లా తినేవారని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈపోజ్ విధానంతో రూ.వెయ్యి కోట్లు ఆదా జరిగిందని, ఆ సొమ్ముతోనే చంద్రన్న సంక్రాంతి, రంజాన్, క్రిస్టమస్ కానుకలు ఇస్తున్నట్లు తెలిపారు. ఏడాది తిరగకుండా గోదావరి నీళ్ళిచ్చామని, మరో ఏడాదిలోగా పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ఏకంగా గోదావరి నీటిని ఇవ్వబోతున్నట్లు తెలిపారు. 1941 నాటి పోలవరం కలను సార్థకం చేసిన అపర భగీరధుడు చంద్రబాబని చెప్పారు. ఇప్పటికీ 55శాతం పనులు పూర్తైనట్లు చెప్పారు. జూలైలో కృష్ణానదిపై వైకుంఠపురం-దాములూరు వద్ద బ్రిడ్జి నిర్మాణంకు టెండర్ల ప్రక్రియ పూర్తౌతుందని తెలిపారు. పదేళ్ళు ప్రజల తరపున నేను పోరాడితే నాపై 11 కేసులు పెట్టారని చెప్పారు. పరిటాలలో ఖరీదు కలిగిన భూములను అప్పటి వైయస్ ప్రభుత్వం కాజేయాలని చూస్తే ఏడాది పాటు రైతులతో కలసి ఉద్యమించి అడ్డుకున్నట్లు చెప్పారు. మైలవరం ఓటర్ల దీవెనల వలన తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నానని, ఈ నాలుగేళ్ళలో 54వేల కోట్ల రూపాయలు జలవనరుల క్రింద ఖర్చు పెట్టినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ను కరవు రహిత రాష్ర్టంగా చేయటానికే చంద్రబాబు జలవనరులకు ఇంతటి ప్రాధన్యత ఇస్తున్నట్లు తెలిపారు. మైలవరం నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమని, నియోజకవర్గ ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని మంత్రి ఉమా స్పష్టం చేసారు. ఈ సభలో 64 మంది లబ్ధిదారులకు కొత్త పింఛన్లు, 29 డ్వాక్రా సంఘాలకు బ్యాంక్ లింకేజి రూ.1.72కోట్లు రుణాలు, 18 స్ర్తీ నిధి గ్రూపులకు 18.80లక్షలు రుణాలు, 43 కొత్త రేషన్ కార్డులు, 2068 మంది లబ్ధిదారులకు రంజాన్ తోఫా అందజేసారు._

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here