నకిలీ విత్తనాలతో రైతులను మోసగిస్తే కఠిన చర్యలు;సీఎం

38

రైతులను మోసగిస్తే కఠినంగా వ్యవహరిస్తాం.గుజరాత్ నుంచి అనుమతిలేని పత్తివిత్తనాలు వస్తున్నాయి. అధికారులు అప్రమత్తంగా ఉండాలి,రైతుల్లో అవగాహన పెంచాలి’’ అని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.సోమవారం నీరు-ప్రగతి,వ్యవసాయం పురోగతిపై నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ‘‘ఈ సీజన్ లో నెల్లూరు జిల్లాలో పంటల ఉత్పాదకత గణనీయంగా పెరిగింది. మిగిలిన జిల్లాలు కూడా నెల్లూరు మోడల్ అధ్యయనం చేయాలి.నెల్లూరులో వాడిన విత్తనాలు,మేలైన పద్ధతులపై రైతులను చైతన్యపరచాలి.

వర్మికంపోస్ట్ ధరలు రైతులకు అందుబాటులో ఉంచాలి:

వర్మికంపోస్ట్ ఉత్పత్తి 207టన్నులు సిద్ధంగా ఉంది. వర్మి తయారీకి 70వేల టన్నుల డంగ్ సిద్ధంగా ఉంది. రసాయన ఎరువుల వాడకం పూర్తిగా తగ్గాలి.సేంద్రియ ఎరువుల వినియోగం పెరగాలి.మన పంట ఉత్పత్తుల నాణ్యత పెరగాలి.నాణ్యమైన వ్యవసాయ దిగుబడులకు ఏపి చిరునామా కావాలి. వర్మికంపోస్ట్ ధరలు రైతులకు అందుబాటులో ఉంచాలి.

వర్మి అమ్మకాలపై వ్యవసాయ,గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంగా వ్యవహరించాలి. ఏ ఊళ్లో వర్మికంపోస్ట్ ఆ ఊళ్లో రైతులకే విక్రయించాలి.ఉద్యమ స్ఫూర్తితో చేపట్టిన జల సంరక్షణ పనులు సత్ఫలితాలు ఇచ్చాయి. వర్షపాతం లోటు ఉన్నా సాగునీటిని ఇవ్వగలిగాం.ఖరీఫ్ సీజన్ కు రైతులకు కావాల్సిన ఇన్ పుట్స్ సిద్ధం చేయాలి.విత్తనాలు,ఎరువులు,రుణాలు కొరత లేకుండా అందించాలి.రోజుకు 23లక్షల కూలీలకు ఉపాధి,ఈ నెలలో నరేగా బడ్జెట్ రూ.1,000కోట్లు: వ్యవసాయ పనులు లేవు కాబట్టి ఉపాధి పనులు ముమ్మరం చేయాలి.

వ్యవసాయ సీజన్ ప్రారంభం అయ్యే లోపు నరేగా గరిష్టంగా జరగాలి. ఈ నెలలో రూ.1,000కోట్లు విలువైన నరేగా పనులు చేయాలి.రోజువారీ కూలీల హాజరు 23లక్షలకు చేరాలి.రాబోయే 21రోజుల్లో లేబర్ టర్నోవర్ పెరగాలి.

525 గ్రామాల్లో తాగునీటి రవాణా జరుగుతోంది.ఈ గ్రామాలలో తాగునీటి పథకాల పనులు వెంటనే పూర్తిచేయాలి. జల సంరక్షణ పనులు ఈ గ్రామాలలో ముమ్మరం చేయాలి.

పట్టణ ప్రాంతాలలో తాగునీటి కొరత లేకుండా చేయాలి గిరిజన తండాలలో రూ.105 కోట్లతో 1,017పనులు వేగవంతం చేయాలి.పెండింగ్ లో ఉన్న 531 పనులు త్వరితగతిన చేపట్టాలి.

మరో 8వేల మరుగుదొడ్లు నిర్మిస్తే 100% ఓడిఎఫ్ పూర్తి అవుతుంది. విశాఖలో మరుగుదొడ్ల నిర్మాణం వేగం పుంజుకోవాలి.ఓడిఎఫ్ ప్లస్ పనులకు అన్నిజిల్లాలు సంసిద్ధం కావాలి.

రూ.900కోట్ల నిధులను సద్వినియోగం చేసుకోవాలి. డిసెంబర్ కల్లా అన్ని గ్రామాలు స్వచ్ఛగ్రామాలు కావాలి.ఓడిఎఫ్ కాగానే ఓడిఎఫ్ ప్లస్ ప్రారంభించాలి.

కేంద్రంతో విబేధించినా తమిళనాడు,కేరళ రాష్ట్రాలు దేశంలో ముందంజలో ఉన్నాయి.అదే విధంగా మన రాష్ట్లం కూడా కేంద్రంతో విబేధించినప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో ముందుండాలి.

మన పనులు చరిత్రలో నిలిచిపోతాయి.భావితరాలు మన కృషిని మరిచిపోవు.విభజన వల్ల పొరుగు రాష్ట్రాల కన్నా దిగువన ఉన్నాం. స్వయంకృషితో మన స్థాయిని మెరుగు పరుస్తున్నాం.

కేంద్రంతో విభేదించినా తమిళనాడు,కేరళ అభివృద్ధిలో ఉన్నాయి.కేంద్రంతో విభేదించినా మన రాష్ట్రం కూడా అభివృద్ధిలో ముందంజలో ఉండాలి.

ప్రాథమిక విద్యలో 3వస్థానంలో ఉన్నాం,ఐఐటిలో 12% ఫలితాలు ఏపివే. దేశంలోనే విద్యారంగంలో ఏపి నెంబర్ వన్ కావాలి.

పేదరికంలేని రాష్ట్రంగా ఏపి ని రూపొందించడమే నా సంకల్పం:
మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ లో మనదేశం ఏ స్థాయిలో ఉందో పరిశీలించండి.

పదేళ్ళలో దేశంలో పేదరికం 51%నుంచి 21%కు తగ్గింది. దక్షిణ భారత రాష్ట్రాలలో పేదరికం స్థాయి 9% వచ్చింది. కేరళలో పేదరికం 1%, తమిళనాడులో 6%,కర్ణాటకలో 11%, ,ఆంధ్రప్రదేశ్ 13%, తెలంగాణ 14% ఉంది.

గుజరాత్ (16%),పశ్చిమ బెంగాల్ (17%) కన్నా ఏపి మెరుగ్గా ఉంది. తొలి ఏడాదిలో చేపట్టిన పథకాల వల్లే ఈ స్థాయి వచ్చింది,మిగిలిన 3ఏళ్లలో మరిన్ని పథకాలు అమలుచేయడం వల్ల మరింతగా మన ర్యాంకు పెరిగివుంటుంది.

దక్షిణాదిలో కూడా ఆంధ్రప్రదేశ్ మరింత మెరుగుపడాలి. పేదరికంలేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపొందాలన్నదే నా సంకల్పం. అందుకోసమే బిసి,ఎస్సీ,ఎస్టీ, ముస్లిం,క్రిస్టియన్ మైనారిటి ప్రజల ఆదాయాల పెరుగుదలకు అనేక చర్యలు చేపట్టాం.

సబ్ ప్లాన్ లకు బడ్జెట్ గణనీయంగా పెంచాం.ప్రతి కుటుంబం రాబడి నెలకు కనీసం రూ.10వేలు ఉండేలా ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నాం.

పిడుగుపాట్లపై గ్రామాలలో ముందస్తు టాంటాం వేయించాలి:
రాష్ట్రంలో పిడుగుపాట్లకు మృతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.13మంది మృతిపై టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి ఆరా తీశారు.

పిడుగుల సమాచారం ముందే వస్తున్నా ప్రాణనష్టం జరగడంపై సీఎం ఆవేదన వ్యక్తంచేశారు.పిడుగుపాట్ల సమాచారం మరింతగా విశ్లేషించాలని అన్నారు.

ఆధునిక సాంకేతికతతో అధ్యయనం చేయాలి. ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి. పిడుగుపాట్ల సమాచారంపై ముందే గ్రామాలలో టాంటాం వేయించాలి. గ్రామాలకు సమాచారం ముందే చేరేలా కమ్యూనికేషన్స్ మెరుగుపరచాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

ఈ టెలికాన్ఫరెన్స్ లో వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖలు, రియల్ టైం గవర్నెన్స్ ఉన్నతాధికారులు రాజశేఖర్,రామాంజనేయులు,రంజిత్ బాషా, అహ్మద్ బాబు, సీఎంవో కార్యదర్శులు రాజమౌళి,సాయిప్రసాద్, వివిధ జిల్లాల కలెక్టర్లు,అధికారులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here