ధవళేశ్వరం బ్రిడ్జిపై కవాతు.. పోలవరం సందర్శన పవన్ కీలక నిర్ణయం!

89

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వరుస పర్యటనలతో దూకుడు పెంచిన ఆయన మున్ముందు మరింత దూకుడుగా వెళ్లాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈనెల 15న రాజమండ్రి ధవళేశ్వరం బ్రిడ్జిపై కవాతు నిర్వహించాలని నిర్వహించారు. నేడు 13 జిల్లాల జనసేన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్న పవన్ ఆదివారం పోలవరం ప్రాజెక్టును సందర్శించి పరిశీలించాలని నిర్ణయించారు. శుక్రవారం రాత్రి విజయవాడలోని పార్టీ కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లా నేతలతో పవన్ సమావేశమై పార్టీని బలోపేతం చేయడం, ఇతర విషయాలపై చర్చించారు. విజయనగరం జిల్లాకు చెందిన వివిధ పార్టీల నేతలు పవన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here