దేశ భద్రత,సుభీక్ష పాలన మోదీ తోనే సాధ్యం -రావెల కిషోర్ బాబు

26

ప్రజారంజక పాలన,దేశ భద్రత,హిందు ధర్మ పరిరక్షణ,దేశ,విదేశ ప్రజల ఆరోగ్య రక్షణ లాంటి విషయాల్లో ఇప్పటికే ప్రపంచ మానవాళి మనసు గెలిచిన నేత నరేంద్రమోదీ గారని ఇందుకోసం ఆయన రెండవసారి ప్రధానిగా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఆంద్రప్రదేశ్ భాజపా రాష్ట్రంలో భాజాపా ఆధ్వర్యంలో నేడు విజయవాడ అయ్యప్ప నగర్ ,పడమటలో మోడీ 2.0 పేరుతో ప్రధానమంత్రి గా రెడవసారి ఎన్నికై ఒక సంవత్సరంపూర్తి అయ్యిన సందర్భంగా సాధించిన విజయాలు,ప్రజా సంక్షేమ పథకాలు గురించిన కరపత్రాలు పంపిణీ ఇంటి- ఇంటికి ఇవ్వటం జరిగింది,ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.

రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ
ప్రధాని మోడీ రెండవ సారి ప్రధానమంత్రి గా బాద్యతలు స్వీకరించిన నాటి నుండి అవినీతిరహిత దేశంగా పాలన చేస్తున్నారు.

ప్రపంచ దేశాల్లో మోడి చేసిన పాలనా విధానాలను అనుసరిస్తున్నారని ఇది ప్రపంచ చరిత్ర లో నిలిచి పోతుందని గుర్తుచేశారు.
ప్రధానిగా గడిచిన ఆరు సంవత్సరాలలో అనేక పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి కార్యరూపాన్ని ఇచ్చిన మహా నాయకుడు మోడీ అని కొనియాడారు..
పలు దశాబ్దాలుగా కాంగ్రేస్ హయం నుండి దేశాన్ని పట్టి పీడిస్తున్న కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేసి సమస్య పరిష్కారానికి ఆర్టికల్ 370 ని రద్దు చేసి రాజ్యాంగ బద్దంగా కాశ్మీర్ ను భారత్ లో అంతర్భాగా చేశారు.
వాహనచట్టం,త్రిబుల్ తలాక్,సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్,రామమందిరం నిర్మాణం లాంటి సమస్యలను పరిష్కరించి నేడు అయోధ్యలో పునాది రాయి ఆవిష్కరించారు.యావత్ ప్రపంచానికి శత్రువు గామరిన కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ముందు చూపుతో పలు దపాల లాక్ డౌన్ ద్వారా ప్రజలను సురక్షితంగా రక్షించే విషయంలో పెద్దన్న పాత్ర. పోషించారు.
మహమ్మారి కరోనా సమయంలో అన్ని వర్గాల ప్రజలను,వలస కూలీలను ఆదుకునేందుకు ,రెండుసార్లు ప్యాకేజీని ప్రకటించి ఆదుకున్న మహనీయుడు నరేంద్ర మోడీ అని రావెల కొనియాడారు ఇక ఈ కార్యక్రమంలో నగర మాజీ అధ్యక్షులు అడ్డురి శ్రీరామ్,మీడియా కన్వీనర్ వుల్లూరి గంగాధర్, సత్యనారాయణ, నాగేశ్వరరావు పోతంశెట్టి, షేక్ ఖాజా అలి, పిట్టల గోవింద్,భోగవల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here