దేశంలో ఏపీని నెంబర్‌వన్‌గా చేస్తా..సీఎం

554

FB_IMG_1471265937779భారతదేశంలోనే ఏపీని నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అనంతపురంలోని నీలం సంజీవయ్య మైదానంలో, రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి జరుగుతున్న పంద్రాగస్టు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి.. గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు అభివృద్ధి సాధించేలా చర్యలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం అన్నివిధాలా కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలుగువారికి ప్రత్యక్ష దైవమైన ఎన్టీఆర్‌ సాక్షిగా రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా.. నిధుల లోటు ఉన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామన్నారు. 2022 నాటికి ఏపీ మూడు అగ్రరాష్ట్రాల్లో ఒకటిగా , 2029 నాటికి నంబర్‌ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అగ్రరాష్ట్రంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గత సంవత్సరం దేశ వృద్ధిరేటు 7.5శాతంగా ఉంటే.. ఏపీ 10.99 శాతం సాధించి నంబర్‌ రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు.

రుణమాఫీ పథకానికి అనంతపురం జిల్లాలోనే శ్రీకారం చుట్టామని చెప్పుకొచ్చారు. వ్యవసాయం, అనుబంధ రంగాల ద్వారా రైతుల ఆదాయం పెంచాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సంక్షేమ హాస్టళ్లను గురుకుల పాఠశాలలుగా మారుస్తున్నామన్నారు. పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు ఆర్థికసాయం అందజేస్తామని చెప్పారు. డ్వాక్రా సంఘాలకు రూ. 10వేల చొప్పున పెట్టుబడి నిధి కల్పిస్తామని తెలిపారు. ఉపాధిహామీని సమర్థవంతంగా వినియోగించుకుంటున్నామని బాబు అన్నారు. ఉపాధిహామీ ద్వారా సీసీరోడ్లు, పంటకుంటల నిర్మాణం చేపట్టామన్నారు. అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామని…ఆర్థికసాయం చేస్తామని హామీ ఇచ్చారు.
అసంఘటిత కార్మికులకు బీమా పథకం మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, పేదల ఆరోగ్యం కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. విద్యారంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here