దేశంలో ఆర్థిక వృద్ధి శరవేగంగా పెరుగుతోంది:ఉపరాష్ట్రపతి వెంకయ్య

26

అవకాశాలకు ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ వేదికగా నిలుస్తోందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. శుక్రవారం విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఆర్థిక వృద్ధి శరవేగంగా పెరుగుతోందన్నారు. ప్రపంచబ్యాంకు, ఏడీబీ, అంతర్జాతీయ సంస్థలు దేశ ఆర్థిక వృద్ధిపై నివేదికలు వెల్లడిస్తున్నాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన అతిపెద్ద ఆర్థిక సంస్కరణ నోట్ల రద్దని వెంకయ్య నాయుడు కొనియాడారు. నల్లధనాన్ని బ్యాంకులకు చేర్చడమే నోట్ల రద్దు ఉద్దేశమని, నోట్ల రద్దు వల్ల బ్యాంకుల వడ్డీరేట్లు తగ్గుతాయన్నారు. జీఎస్టీ (వస్తుసేవలపన్ను) ని కేంద్రం.. ఒక పార్టీ నిర్ణయించలేదని, అన్ని రాష్ట్రాలు పలుమార్లు సమావేశమై అంగీకరించాయని వెంకయ్య తెలిపారు. జీఎస్టీ అమలు కోసం 21 సమావేశాలు నిర్వహించారని ఆయన వెల్లడించారు. కాగా విశాఖలో ఈ సదస్సు నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి సురేశ్ ప్రభుకు వెంకయ్య అభినందనలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here