దిల్ రాజు సపోర్టుతో `వెళ్ళిపోమాకే`

33

నూతన చిత్రాలకు, నటీనటులకు, టెక్నిషియన్స్ కు అండగా నిలబడే హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మరోసారి ఒక యంగ్ టీం కు సపోర్ట్ చేయబోతున్నాడు. యాకూబ్ అలీ దర్శకత్వంలో రూపొందిన `వెళ్ళిపోమాకే`. చిత్రాన్ని దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శ‌నివారం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో….. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ -“బాహుబ‌లి చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతి ప్ర‌పంచానికి తెలిసింది. అలాగే ఈ ఏడాది చిన్న సినిమాగా విడుద‌లైన పెళ్ళిచూపులు సెన్సేష‌న‌ల్ స‌క్సెస్ సాధించింది. ఈ రెండు సినిమాలు తెలుగు సినిమా గ‌మ‌నం మారుతుంద‌ని చెప్ప‌డానికి నిద‌ర్శ‌నాలుగా నిలిచాయి. ఇలాంటి చిత్రాలు వ‌చ్చిన‌ప్పుడే నిర్మాత‌లైన మేం కూడా ట్రెండ్‌కు అనుగుణంగా ముందుకు వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తాం. అప్ డేట్ అవుతుంటాం. ఇటీవల హీరో నాని `ఇలా నా జ‌త‌గా` అనే సినిమా ట్రైల‌ర్ బావుంద‌ని షేర్ చేశాడు. దాన్ని చూసిన నా టీం ట్రైలర్ బావుందని నాకు చెప్పడంతో నేను కూడా ఆ ట్రైల‌ర్‌ను చూశాను. నాకు సినిమా మేకింగ్ చాలా బాగా న‌చ్చింది. మంచి ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీని ద‌ర్శ‌కుడు యాకూబ్ అలీ చ‌క్క‌గా ఎగ్జిక్యూట్ చేశాడు. దానికి తగిన విధంగా నటీనటులు కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. సినిమా చాలా బాగా నచ్చడంతో సినిమాను ప్రేక్ష‌కుల్లోకి మ‌రింత‌గా తీసుకెళ్ళాల‌నే ఉద్దేశంతో ఈ సినిమాను నేను విడుద‌ల చేయాలని నిర్ణయించుకున్నాను. తర్వాత ఈ సినిమాను ఎవరూ చేశారనే దానిపై ఎంక్వైరీ చేసి దర్శకుడు యాకూబ్ అలీని కలుసుకున్నాను. . ఈ సినిమాకు టైటిల్ ను మార్చి `వెళ్ళిపోమాకే` అనే టైటిల్‌ను పెట్టాం. ఒక అబ్బాయి, ఇద్ద‌ర‌మ్మాయిల మ‌ధ్య జ‌రిగే క్యూట్‌, ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ. విశ్వక్ సేన్ సహా ఏడెనిమిది క్యారెక్టర్స్ మధ్య సాగే ఫీల్ గుడ్ మూవీ యాకూబ్ అండ్ టీం క‌లిసి, కొత్త‌గా చేసిన ప్ర‌య‌త్నమే `వెళ్ళిపోమాకే`. మా వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో తనకు దర్శకత్వం చేయమని అవకాశం ఇచ్చేతంగా యాకూబ్ అలీ సినిమాను తెరకెక్కించాడు. దర్శకుడు న‌టీన‌టుల నుండి పెర్‌ఫార్మెన్స్‌ ను రాబ‌ట్టుకున్న తీరు, మంచి మ్యూజిక్‌తో పాటు ఆర్టిస్టుల పెర్‌ఫార్మ‌న్స్ బాగా న‌చ్చింది. మంచి అనుభ‌వ‌మున్న న‌టుల్లా న‌టించారు. హీరో విశ్వ‌క్ సేన్ అనుప‌మ్ ఖేర్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్లో ట్ర‌యినింగ్ తీసుకున్నాడు. అలాగే డైరెక్ట‌ర్ యాకూబ్ అలీ రామానాయుడు స్టూడియోలో ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో శిక్ష‌ణ తీసుకున్నాడు. అలాగే మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ విహారి ఎ.ఆర్‌.రెహ‌మాన్ మ్యూజిక్ స్కూల్‌లో ట్ర‌యినింగ్ తీసుకున్నాడు. ఇలాంటి మంచి కాన్సెప్ట్‌ తో వ‌స్తున్న యంగ్ టీంను ఎంక‌రేజ్ చేస్తే మ‌రిన్ని మంచి సినిమాలు వ‌స్తాయ‌ని నేను సినిమాను విడుద‌ల చేయ‌డానికి ముందుకు వ‌చ్చాను“ అన్నారు.
ద‌ర్శ‌కుడు యాకూబ్ అలీ మాట్లాడుతూ – “ఈ సినిమాను రెండున్న‌ర సంవ‌త్స‌రాల క్రిత‌మే స్టార్ట్ చేశాం. నాకున్న బ‌డ్జెట్ ప‌రిమితుల్లో, వ‌న‌రుల‌తో చేసిన సినిమా ఇది. ఇలాంటి సినిమా న‌చ్చి దిల్‌ రాజుగారు సినిమాను విడుద‌ల చేద్దామ‌నే ఉద్దేశంతో ముందుకు రావ‌డం చాలా ఆనందంగా ఉంది. అందుకు దిల్‌రాజుగారికి థాంక్స్‌. అంద‌రూ స‌పోర్ట్ మాకు ఉంటుంద‌ని భావిస్తున్నాం“ అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ విహారి, హీరో విశ్వ‌క్ సేన్ త‌దిత‌రులు పాల్గొని దిల్ రాజుకు థాంక్స్ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here