దగాకోరు.. మోసాల రాయుడు మోదీ..మంత్రి సుజయ్

154

గుంటూరు సభలో ప్రధాని మోది చేసిన ప్రసంగంపై భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయ్ కృష రంగారావు నిప్పులు చెరిగారు. మోది మాయమాటలు, నటన విన్యాసాలు తెలుగు ప్రజలు నమ్మరని మంత్రి సుజయ్ స్పష్టం చేశారు. నోటికి అడ్డు అదుపు లేకుండా మోదీ చేసిన ప్రసంగంపై రాష్ట్ర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. విభజన హామీలు ఏమేరకు అమలు చేశారో చెప్పలేక , రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పై సిగ్గులేకుండా విమర్శలు చేయడంతోనే సభను సరిపెట్టారని మంత్రి సుజయ్ అన్నారు.
ఆర్థిక లోటుతో కొనసాగున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఘనత చంద్రబాబు దని తెలిపారు. సీనియర్ నాయకుడు తన అనుభవంతో రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి నింపారని మంత్రి సుజయ్ అన్నారు. నదుల అనుసంధానం దేశంలో మొట్టమొదటి సారిగా చేసిన నాయకుడు చంద్రబాబు అని తెలిపారు.నాలుగేళ్ళ లో పంటల ద్వారా 44 వేల కోట్ల సృష్టించి రైతుల కళ్ళల్లో ఆనందం నింపారని అన్నారు. చంద్రబాబు అనుభవాన్ని నమ్మిన అనేక దేశీ విదేశ బడా పారిశ్రామిక వేత్తలు రాష్ట్రం వైపు చూస్తున్నారని,ఐ. టి, ఆటోమొబైల్ కంపెనీలు సంస్థలు నవ్యాంధ్ర లో ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు తన సినియారిటీని రుజువు చేసుకున్నారని మంత్రి సుజయ్ స్పష్టం చేశారు. 24,500 కోట్లు రుణమాఫీ చేసి అందరి మన్నల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతం చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మీ భాగస్వామ్యం ఉందని చెబుతున్న మోది గారు ఏ స్థాయిలో ఆర్థిక సహాయం అందిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేసారు. కోట్లది రూపాయల ఖర్చు పెట్టి నిర్వహించిన సభ అట్టర్ ఫ్లప్ షో అని మంత్రి సుజయ్ విమర్శించారు. దేశంలో వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్న చక్రవర్తి మోడి అని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కు చాలా నిధులు ఇచ్చారని మోది చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అమరావతి కి 1500 కోట్లు, పోలవరానికి 6500 కోట్లు, జాతీయ విద్యాసంస్థలకు కేవలం 842 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్న మోసకారి మోదీ అని మంత్రి సుజయ్ అన్నారు. అందమైన సూట్లు బూట్లు వేసుకొని దేశీ విదేశాలు తిరుగుతున్న మోడీ దేశ ఆర్థిక వ్యవస్థ ను దెబ్బతీసారని, రాజ్యాంగ సంస్థలను సహితం అపహాస్యం చేసేవిధంగా నిరంఖుస పాలన సాగించారని ఫైర్ అయ్యారు. రిజర్వ్ బ్యాంకు, సిబిఐ, దేశ భద్రత సంస్థలను భ్రష్టు పట్టించని ఘనుడు మోది అని అన్నారు. మోదీ చేసిన ప్రసంగానికి జీవిల్ నర్సింహారావు చేసిన అనువాదాన్ని తెలుగువాసులు నవ్వుకుంటున్నారని మంత్రి సుజయ్ ఎద్దవా చేశారు. మోసకారి మోదిని సాగణపేందుకు దేశవాసులు ఓటు తో సిద్ధంగా ఉన్నారని సుస్పష్టం చేశారు. ఆర్థిక నేరగాళ్లకు అండగా ఓ రక్షకుడిగా నిలిచిన మోదీ కి ఆయనకు వంత పడుతున్న పార్టీలకు పరాభవం తప్పదని భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here