త్వరలో ప్రతీ స్కూల్‌కు ఇంటర్నెట్

46

chandrababuరాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు త్వరలో ఇంటర్నెట్‌ సేవలు సౌకర్యం కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. భవిష్యత్తులో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అన్ని శాఖల కంటే విద్యాశాఖకే ఎక్కువ నిధులు కేటాయించామని.. విద్యారంగంలో పెద్దఎత్తున మౌలిక సదపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here