త్వరలో తెరపైకి నందమూరి బ్రదర్స్..?

30

ఈ మద్య జూనియర్ ఎన్.టి.ఆర్– కళ్యాణ్ రామ్ మద్య సఖ్యత చూస్తుంటే అందరికి ముచ్చేటేస్తుంది. ఎక్కడికి వెళ్ళిన ఇద్దరు కలిసి వెళ్తున్నారు , అదే విధంగా వాళ్ళ మద్య అనుభందం కూడా బాగా బలపడింది. కళ్యాణ్ రామ్ చాల ఏళ్ళ తర్వాత పటాస్ హిట్ తో జోష్ మీద ఉన్నాడు. ఇంకా రవితేజ కిక్ 2 నిర్మించి టేబుల్ ప్రాఫిట్ లో ఉన్నాడు కళ్యాణ్. మొన్నటి వరకు తమ్ముడు ఎన్ టి అర్ తో సినిమా తీసే ప్రయత్నంలో ఉన్నాడు కళ్యాణ్ రామ్. ఎన్ టి అర్ తో చేసే సినిమా కచ్చితంగా వక్కంతం వంశి కథ సమకూర్చాలని ఫిక్స్ అయ్యాడు. రక రకాల కథలు చెప్పిన వక్కంతం వంశి, మల్టీ స్టారర్ కథ కూడా ఒకటి వినిపించదంట. ఈ కథ కళ్యాణ్ రామ్ కి బాగా నచ్చి ఎన్ టి అర్ కి కూడా వినిపించదంట. ఎన్ టి అర్ కూడా కళ్యాణ్ రామ్ తో మల్టీ స్టారర్ చెయ్యడానికి ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. మరి అన్ని కుదిరితే అన్నదమ్ములని ఆఫ్ స్క్రీన్ లోనే కాదు ఆన్ స్క్రీన్ లో కూడా కలిపి చూడచ్చు. ఏది ఏమైనా నందమూరి అభిమానులకి ఇది పండగ లాంటి వార్త .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here