త్వరలో టీడీపీలో కి వస్తున్న…నటి వాణీ విశ్వనాథ్

15


నటి వాణీ విశ్వనాథ్ టీడీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలకు ఆమె తెరదించారు. త్వరలోనే టీడీపీ చోరబోతున్నానని ఆమె స్పష్టం చేశారు. ఏపీలో పరిపాలన బాగుందని కితాబిచ్చారు. మంగళవారం సీఎం చంద్రబాబును కలుస్తానని, రాజకీయాలలో పూర్తి స్తాయిలో పనిచేయడానికి సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశిస్తే వైసీపీ ఎమ్మెల్యే రోజాపై పోటీకి సిద్దమని ప్రకటించారు. తనకు రోజా పోటీ అనుకోవడం లేదని వాణీవిశ్వానాథ్ వ్యాఖ్యానించారు. గతంలో ఓ ఇంటర్య్వూ లో మాట్లాడిన వాణీ విశ్వనాథ్ తనకు ఏపీ అన్నా చంద్రబాబు న్యాయకత్వం అన్నా ఇష్టమని చెప్పారు. చంద్రబాబు గొప్ప నాయకుడని కొనియాడారు. తాను మళయాళీని అయినప్పటికీ తెలుగు ప్రజలు అంటే ఇష్టమని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here