తెలుగుద‌నం ఉట్టిప‌డేలా రాముల‌వారి క‌ల్యాణ‌వేదిక‌

88

ఒంటిమిట్టలో జ‌రుగుతున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తెలుగు సంప్ర‌దాయం ఉట్టిప‌డేలా క‌ల్యాణ‌వేదిక‌ను తీర్చిదిద్దారు. వేదిక రంగురంగుల పుష్పాలు, ఫలాలతో చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. చల్లటి సాయంత్రం వేళ సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులు ఫలపుష్పాల అలంకరణ చూసి ముగ్ధులయ్యారు.

చెరుకులు, టెంకాయపూత, అరటి ఆకులు, మామిడాకులు, మామిడికాయలు, బ‌త్తాయి, ద్రాక్ష, దోస, మొక్కజొన్న తదితర ఫలాలు, నీలం ఆర్కిడ్‌, రెడ్‌ ఆంథూరియం తదితర విదేశీ జాతుల పుష్పాలతో కల్యాణవేదికను అలంకరించారు. 6 ర‌కాల‌కు చెందిన 3 టన్నుల సంప్రదాయపుష్పాలు, 9 ర‌కాల‌కు చెందిన 25 వేల కట్‌ ఫ్లవర్స్‌, 500 కిలోల ఫలాలు వినియోగించారు. టిటిడి ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాసులు పర్యవేక్షణలో బెంగళూరుకు చెందిన 20 మంది అలంకరణ నిపుణులు, 40 మంది టిటిడి సిబ్బంది కలిపి ఇందుకోసం పనిచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here