తెలంగాణ రాష్ట్రంలో 21 మందికి కరోనా పాజిటివ్‌: సీఎం కేసీఆర్‌

60

700 మందికి పైగా కరోనా అనుమానితులకు పరీక్షలు చేశామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 21 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైందని, విదేశాల నుంచి వచ్చే వారితోనే సమస్య వస్తోందని చెప్పారు. విదేశాల నుంచి రాష్ట్రానికి 20 వేల మందికి పైగా వచ్చారని తెలిపారు. కరీంనగర్‌ ఘటన తర్వాత కలెక్టర్ల సమావేశం పెట్టామని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కరోనా లక్షణాలు ఉన్నాయా లేదా అనేది తెలియడం లేదన్నారు. 11 వేల మందిని గుర్తించి ఆధీనంలోకి తీసుకున్నామని, 5,274 నిఘా బృందాలను ఏర్పాటు చేశామని కేసీఆర్ పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై 14 రోజుల పర్యవేక్షణలో ఉండాలని చెప్పారు.

‘‘అందరూ బయటి దేశాల నుంచి వచ్చిన వారే. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో 52 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు. 78 జాయింట్‌ టీమ్‌లను ఏర్పాటు చేశాం. అంతర్జాతీయ పరిణామాలను పర్యవేక్షించేందుకు ఐదుగురితో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశాం’’ అని కేసీఆర్‌ తెలిపారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here