తెదేపా ఎంపీలు లోక్ సభలో యుద్ధం చేస్తున్నారు;మంత్రి దేవినేని

30

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఏపీ జలవనరుల శాఖ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. జి.కొండూరు మండలం కోడూరు గ్రామంలో శనివారం నాడు జరిగిన గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఇంజనీర్లు చింతలపూడి పనులు చేస్తున్నారని, చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తయితే మైలవరం నియోజకవర్గం తోపాటు రెండు జిల్లాలోని నియోజకవర్గాలు సస్యశ్యామలం అవుతాయని తెలిపారు. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి పార్లమెంటు నుండి పారిపోతే, రాష్ట్రానికి రావలసిన హక్కుల కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటులో నిలబడి యుద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి గైర్హాజరై, బడి ఎగ్గొట్టిన పిల్లాడిలా రోడ్ల వెంట తిరుగుతున్నట్లు బాధ్యత కలిగిన వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష బాధ్యతలను నిర్వర్తించకుండా జగన్ వెంట తిరుగుతూ డబ్బులు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. జి.కొండూరు మండలం లో లో 1800 ఇళ్ల పట్టాలు త్వరలోనే పసుపు కుంకుమ చీర పెట్టి మరీ పంపిణీ చేస్తామన్నారు. కోడూరు గ్రామంలో ఈ నాలుగేళ్లలో రూ. 1.70కోట్లు ఎన్టీఆర్ భరోసా ఇచ్చామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు గ్రామాల్లో కులాలను రెచ్చగొట్టి కక్షలు కార్పణ్యాలు పోగు చేస్తున్నారని, అట్టి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హితవు చెప్పారు._

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here