తీరుమారని ప్రభుత్వ శాఖలు..గ్రీవెన్స్ డేకి అధికారుల గైర్హాజరు..!

44

నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మార్వో ఆఫీస్ కార్యాలయంలో.. ప్రతి సోమవారం జరిగే “ప్రజా విజ్ఞప్తుల దినం” కార్యక్రమం మందకొడిగానే సాగుతుంది. తమ సమస్యలు తెలుపుకోవడానికి ప్రజలు తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్నారే తప్ప, ప్రభుత్వ శాఖల అధికారులు మాత్రం గ్రీవిన్స్ డేలో పాల్గొనకుండా, ప్రభుత్వ ఆదేశాలు ప్రక్కనబెట్టి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈరోజు గ్రీవిన్స్ డే… వెంకటగిరి ఎమ్మార్వో కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ పనిచేయకపోవడంతో, స్థానిక ఎమ్మార్వో డక్కిలి ఎమ్మార్వో ఆఫీసులో పాల్గొన్నారు. దీంతో వెంకటగిరి ఎమ్మార్వో కార్యాలయంలో గ్రీవెన్స్ డే వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు లేక బోసిపోయింది. గ్రీవెన్స్ డేలో… ప్రధానంగా 27 ప్రభుత్వ శాఖలు పాల్గొనవలసి ఉండగా, కొంతమంది అధికారులు మాత్రమే ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చి వెళ్లిపోయారు. మిగిలిన ప్రభుత్వ శాఖల అధికారులు పూర్తిగా గైర్హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here