తిరుమల శ్రీవారిపై వ్యాఖ్యలు.. కనిమొళిపై కేసు నమోదు

98

తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీ ఎంపీ కనిమొళిపై సైదాబాదు పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఎంపీ కనిమొళి ఇటీవల ఓ సమావేశంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని కించపరిచేలా ప్రసంగించారు. దానిపై హైదరాబాద్‌లోని సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని న్యాయవాది కషింశెట్టి కరుణాసాగర్‌ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఐపీసీ 295-ఎ, 298, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరారు. గురువారం ఈ పిటిషన్‌ను కోర్టు విచారించింది. కోర్టు ఆదేశాల మేరకు కనిమొళిపై సైదాబాదు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here