తిరుమల పవిత్రతను సుసంపన్నం చేయాలి;గవర్నర్ నరసింహన్

103

తిరుమల పవిత్రతను మరింత సుసంపన్నం చేసేందుకు కృషి చేయాలని గవర్నర్ నరసింహన్ గారు సూచించారు. మంగళవారం విజయవాడ వచ్చిన గవర్నర్ గారిని గేట్ వే హోటల్లో టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా గవర్నర్ గారు మాట్లాడుతూ… మీ గురించి విన్నాను ! నిత్యం భక్తి ప్రపత్తులతో పూజలు చేస్తుంటారట గదా ! మీ హయాంలో తిరుమల దేదీప్యమానంగా వెలుగొందుతుందని భావిస్తున్నట్లు వ్యక్తం చేశారు. భక్తులకు సాధ్యమైనంత తక్కువ సమయంలో దర్శనమయ్యేట్లు చూడాలని కోరారు. టీటీడీలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టినట్లు సుబ్బారెడ్డి గారు గవర్నర్ గారికి తెలియజేశారు. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడేందుకు విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టడం.. కొండపై రద్దీ తగ్గించేందుకు భక్తులకు కొండ కిందనే వసతి కల్పన.. ఏర్పాటు కాబోతున్న నూతన పాలక మండలి తీసుకోనున్న నిర్ణయాలను గవర్నర్ కు సుబ్బారెడ్డి గారు వివరించారు.

– టీటీడీ బోర్డు చైర్మన్ క్యాంప్ కార్యాలయం, తాడేపల్లి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here