తిరుమలలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు చాలా బాగున్నాయి :గవర్నర్‌

170

కలియుగ వైకుంఠమైన తిరుమలకు విచ్చేసే భక్తులకు టిటిడి అందిస్తున్న అన్నప్రసాదాలు చాలా బాగున్నాయని ఉమ్మడి తెలుగు రాప్ట్రాల గవర్నర్‌ గౌ|| శ్రీ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ అన్నారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో గౌ|| గవర్నర్‌ దంపతులు మంగళవారం మధ్యాహ్నం భక్తులతో కలిసి బోజనం చేశారు.

ఈ సందర్భంగా గౌ|| గవర్నర్‌ మీడియాతో మాట్లాడుతూ దేశ విదేశాల నుండి శ్రీవారి దర్శనానికి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు టిటిడి శుచిగా, నాణ్యమైన అన్నప్రసాదాలు అందిస్తుందని ప్రశంసించారు. అన్నప్రసాద భవనంలో పేద, ధనిక అన్న తేడా లేకుండా సహపంక్తి భోజనాలు అందిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో క్యాటరింగ్‌ అధికారి శ్రీ శాస్త్రీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here