తిరుపతిలో నాణేల పరకామణిని తనిఖీ చేసిన- టిటిడి ఛైర్మన్‌

153

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి భక్తులు సమర్పించిన  నాణేలను వేగవంతంగా మార్పిడి చేయాలని టిటిడి ఛైర్మన్‌ శ్రీ పూట్టా సుధాకర్‌ యాదవ్‌  అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని నాణేల పరకామణిని శుక్రవారం టిటిడి ఛైర్మన్‌ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఛైర్మన్‌ మాట్లాడుతూ భక్తులు శ్రీవారికి సమర్పించిన కానుకలలోని నాణేలు పేరుకుపోకుండా లెక్కింపు పూర్తి చేసి బ్యాంకులలో డిపాజిట్‌ చేయాలన్నారు. విదేశీ, స్వదేశీ నాణేల విభజన, లెక్కింపును త్వరితంగా పూర్తిచేయాలన్నారు. గత పరిశీలన అనంతరం దాదాపు రూ.2 కోట్ల నాణేలను బ్యాంకులలో జమచేశామన్నారు. వారం రోజులలో మరో రూ.2 కోట్లు బ్యాంకులలో జమచేస్తామన్నారు. మిగిలిన నాణేలను వీలైనంత త్వరగా బ్యాంకులలో జమచేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే కమిటీ సభ్యులు రిజర్వు బ్యాంక్‌ అధికారులతో చర్చిస్తారన్నారు. అంతకుముందు ఆయన అధికారులతో కలిసి నాణేల పరకామణిని, ట్రేజరిని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఎఫ్‌ఎ అండ్‌ సిఎవో శ్రీ బాలాజి, విజివో శ్రీ అశోక్‌కుమార్‌గౌడ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here