తాత్కాలిక, పొరుగు సేవల సిబ్బందికి ప్రభుత్వం టోకరా !

140

తాత్కాలిక, పొరుగు సేవల ఉద్యోగులకు టైమ్‌స్కేలు అమలులో ప్రభుత్వం టోకరా వేసిందని వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి నాగరాజు శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో విమర్శించారు. 2015 పీఆర్‌సీ టైమ్‌ స్కేలు కేవలం పది వేల మందికి లబ్ది చేకూరుస్తూ 12వ నెంబరు జీవో జారీ చేయడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో సుమారు 3 లక్షల మంది వెట్టి చాకిరీ చేస్తుంటే.. వాళ్లను ఇలా మోసం చేయడం తగదని హితవు పలికారు. గతంలో రెగ్యులర్‌ ఉద్యోగులకు మాదిరిగా తాత్కాలిక, పొరుగు సేవల సిబ్బందికి మూల వేతనం అమలు చేస్తూ జారీ చేసిన 3వ నెంబరు జీవోను ఈ ప్రభుత్వం రద్దు చేసినట్లు తెలిపారు. ఉన్న హక్కును తొలగించి వేతనాలు తగ్గించేట్లు వివిధ కేటగిరీలుగా విభజించడం అన్యాయమని పేర్కొన్నారు. ఇది సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘించడమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం తాత్కాలిక, పొరగు సేవల సిబ్బందికి టైమ్‌ స్కేలు అమలు చేయాలని కోరారు. రెగ్యులర్‌ ఉద్యోగులకు మాదిరిగా కరవు భత్యం, డీఏతోపాటు యాక్సిడెంటల్‌ డెత్‌కు రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here