తప్పుడు కేసులు పెడితే ఖబడ్దార్: చంద్రబాబు

12

రాష్ట్ర రాజధాని మంగళగిరిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘మహా సంకల్పదీక్ష’లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు   ప్రసంగించారు. ఉమ్మడి రాజధానిలో ఏపీ ప్రజలకు బ్రతికే హక్కు లేదా? అని ప్రశ్నించారు. తన వద్ద ఇంకా చాలా అస్త్రాలు ఉన్నాయని, అవసరాన్ని బట్టి ఒక్కోక్కటిగా వదులుతానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ ఔట్‌ అన్నవాళ్లు ఏమైపోయారో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల మధ్య తగాదాలు వద్దని హితవు చెప్పారు. తాను కన్ను తెరిస్తే మీకు కష్టాలే ఉంటాయని, హైదరాబాద్ మీ జాగీరుకాదని టీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగారు. కుట్ర రాజకీయాలు చేస్తే ఊరుకోనేది లేదని, ఖబడ్దార్‌ జాగ్రత్తగా ఉండండి అంటూ బాబు తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here