డ్వాక్రా మహిళలకు తీపి కబురు..!

216

నవరత్నాలు పథకాల్లో భాగంగా ‘వైఎస్సార్‌ ఆసరా’ ద్వారా డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేసేందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి గ్రీన్‌సిగ్నల్‌. ఏప్రిల్‌ 11వ తేదీకి ముందు రుణం తీసుకున్న డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం రుణమాఫీ చెయ్యాలని నిర్ణయం. ఈమేరకు రూ.840 కోట్ల మాఫీ చేయనున్నారు. ఈ రుణమాఫీని నాలుగు విడతలుగా చేపట్టనున్నారు. కానీ రుణం పొందిన మహిళలు తమ బాకీని మాత్రం కడుతూ ఉండాలి. తరువాత రోజుల్లో ప్రభుత్వం నుంచి మాఫీ అయినా నగదు మొత్తం లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్‌లో జమవుతుంది. మండలాలు, పట్టణాల్లో సంబంధిత అధికారులు బ్యాంకు ల ద్వారా అర్హులైనా లబ్ధిదారులను ముందుగా గుర్తిస్తారు. అలా గుర్తించిన వారిని ఏపీఎం లాగిన్‌ ద్వారా సెర్ఫ్‌కు సమాచారం అందిస్తారు. అనంతరం 2019, ఏప్రిల్‌ 11 నాటికి అప్పుతీసుకున్న డ్వాక్రా సభ్యులకు ఆ మొత్తాన్ని బ్యాంకులో జమచేస్తారు. నాలుగు విడతల్లో లబ్ధిదారులందరికీ రుణ మాఫీ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here