'టెంపర్'లో కొత్త సీన్లు..!

92

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ , కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘టెంపర్’ మూవీ కలెక్షన్ల రేసులో దూసుకుపోతోంది. ఆ తర్వాత కానీ అంతకుముందు కానీ రిలీజైన సినిమాలేవీ పోటీనివ్వలేకపోవడం కూడా టెంపర్ కి ఓ కలిసొచ్చే అంశమైంది. ఇదిలావుండగానే ‘టెంపర్’ కలెక్షన్లని మరింత పెంచుకోవడానికి ప్లాన్ చేసిన యూనిట్ తాజాగా ఆ సినిమాలో మరికొన్ని సీన్లని కలిపింది. దాదాపు ఏడెనిమిది నిమిషాల నిడివిగల దృశ్యాలు ‘టెంపర్’కి కొత్తగా యాడ్ అయ్యాయి. సెకండాఫ్‌లో కొంత కామెడి లోపించిందని భావించిన యూనిట్.. అలీ – సప్తగిరిలపై షూట్ చేసిన కామెడి సీన్స్‌ని యాడ్ చేసినట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here