‘టీవీ 5’ని నిషేధించిన వైఎస్సార్‌ సీపీ పార్టీ

53

టీడీపీని భుజానమోస్తు వార్తా ప్రసారాలు, టీవీ చర్చలు చేపడుతున్న టీవీ 5 చానల్‌పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ చానల్‌ నిర్వహించే చర్చవేదికలను తమ పార్టీ బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. తమ పార్టీ తరఫున ఏ ఒక్కరు కూడా టీవీ 5 చానల్‌ చర్చావేదికలకు వెళ్లరాదని పేర్కొంది. తమ పార్టీ వారిని చర్చలకు ఆహ్వానించరాదని టీవీ 5కి కూడా సూచించింది. అంతేకాకుండా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రెస్‌మీట్లకు, పార్టీ కార్యక్రమాలకు టీవీ 5ని నిషేధిస్తున్నట్టు వెల్లడించింది.

స్వతంత్ర మీడియా ముసుగులో ఎల్లో మీడియాగా మారిన వారిని బట్టబయలు చేసేందుకే వైఎస్సార్‌ సీపీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. కాగా, గతంలో ఏబీఎన్‌ చానల్‌పై కూడా వైఎస్సార్‌ సీపీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here