టీడీపీ వర్క్‌షాప్‌‌లో ఎంపీ అవంతి శ్రీనివాస్‌ ఆవేశపూరిత ప్రసంగం!

60

టీడీపీ వర్క్‌షాప్‌లో అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ ఆవేశపూరితంగా ప్రసంగించారు. చంద్రబాబును ఉద్దేశించి ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రే కాదు… 5 కోట్ల మందికి ప్రతినిధి అని గుర్తుపెట్టుకోవాలని బాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఢిల్లీకి 42 సార్లు వెళ్లొచ్చారు.. విభజన చట్టంలోని హామీలు ఒక్కటి కూడా అమలుకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు.. ఇంతవరకు ప్రత్యేక ప్యాకేజీ, రైల్వేజోన్‌ కూడా అమలు కాలేదని అవంతి పేర్కొన్నారు.

‘‘ మీకు సముద్రమంత సహనం ఉంది. కానీ ప్రజలు అంతా గమనిస్తున్నారు. మీ అంత సహనం ప్రజలకు లేదు. అవసరమైనప్పుడు తీర్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఏపీ ప్రజలు ప్రతిదానికి తెలంగాణ ప్రజల్లా ఆందోళన చేయరు. సమయం చూసి ఏపీ ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనైనా హామీలు అమలుకు నోచుకోవాలి’’ అని అవంతి శ్రీనివాస్ ఆవేశంగా ప్రసంగించారు. ఎంపీ అవంతి ప్రసంగానికి ఎమ్మెల్యేల హర్షధ్వానాలు పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here