టీడీపీ ప్రభుత్వంలోనే మాదిగలు అభివృద్ధి

తెదేపా ప్రభుత్వంలోనే మాదిగలకు అన్ని రంగాల్లో తగిన గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్.జవహర్ పేర్కొన్నారు.తూర్పుగోదావరి జిల్లా మండపేటలో జరిగిన మాదిగల ఆత్మీయ కలయికకు మంత్రి జవహర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.జీవో నెం:25 ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో దళితులకు సంక్షేమ పథకాలు అమలు జరుగుతుందని వెల్లడించారు.ప్రధానంగా ఏళ్ళ తరబడి మూతపడిన లిడ్క్యాప్ సంస్థను పునఃప్రారంభించిన ఘనత తెదేపా ప్రభుత్వానికి దక్కిందన్నారు.రానున్న కాలంలో మాదిగల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు ప్రకటిప్రకటించారు. ఈ కార్యక్రమంలో మండపేట ఎమ్మెల్యే వి.జోగేశ్వరరావు, కొవ్వూరు ఏఎంసీ ఛైర్మన్ వేగి చిన్నా, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పిల్లి మాణిక్యాలరావు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *