టీడీపీ నేత జూపూడి సంచలన నిర్ణయం!

 

ఒకపక్క ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నాడు..ప్రజాదరణ మాట అలా ఉంచితే ప్రజల నుంచీ కనీస స్పందన లేకపోవడంతో వైసీపి నేతలు ఆలోచనలో పడ్డారు…అయితే ఇప్పుడు టిడిపి నేత జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ టిడిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో సుమారు 82 రోజుల పాటు రాష్ట్రంలో ప్రతి దళితవాడలో పర్యటిస్తామని టీడీపీ నేత జూపుడి ప్రభాకర్ తెలిపారు.

అయితే ఈ యాత్రలో దళితుల అవసరాలని తెలుసుకుని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని..వారికి మరిన్ని సేవలు అందేలా చంద్రబాబు చర్యలు చేపడుతారని..మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పర్యటలలో ప్రతీ ఒక్కరు వచ్చి తెలుపవచ్చు అని అన్నారు..అయితే ప్రతి దళితవాడలో పర్యటించడానికి సంబంధించి దళితులతో కో ఆర్డినేషన్ కమిటీలను నియమిస్తామన్నారు…ఈ కార్యక్రమం జనవరి 27 నుండి ఏప్రిల్ 20వరకు 82రోజులు చేపట్టనున్నామన్నారు. ఏప్రిల్ 20న చివరి రోజు బైబిల్ మిషన్ గ్రౌండ్స్‌లో 2లక్షల మందితో బహిరంగా సభను నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

అయితే ఏప్రియల్ 14 న సుమారు 125 అడుగుల..అంబేద్కర్ విగ్రహా ఏర్పాటుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారన్నారు. నిన్న విశాఖ పెందర్తిలో జరిగిన ఎస్సీ మహిళ పై దాడి ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని ఒక్క వ్యక్తి చేసిన తప్పు చస్తే మొత్తం పార్టీని నిందించడం సరి కాదని తెలిపారు..చంద్రబాబు దళితుల అభివృద్దికి ఎంతో కృషి చేస్తున్నారని…ఏ సీఎం ఇప్పటి వరకూ దళితులపై ఇంట శ్రద్ధ చూపలేదని తెలిపారు జూపూడి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *