టీడీపీ టికెట్ ఇచ్చినా…వైసీపీ వైపు అభ్యర్థుల చూపు

81

తెలుగుదేశం పార్టీ ఓటమి ఖరారయ్యిందా..టీడీపీ నేతలకు కూడా ఓటమిపై క్లారిటీ వచ్చింది. అందుకే అధినేత చంద్రబాబు టికెట్లు ఇచ్చినా, పోటీకీ నో అంటున్నారు పలువురు టీడీపీ కీలక నేతలు. టీడీపీ బీ ఫాం పై పోటీ చేస్తే ఓటమి తప్పదని నిర్ణయించుకున్న పలువురు కీలక నేతలు, వైసీపీ తో సంప్రదింపులు జరుపుతున్నారనే విషయం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆదాల ప్రభాకర్ రెడ్డి ( నెల్లూరు రూరల్), టీడీపీ తొలి జాబితాలో టికెట్ దక్కింది. అయినా జగన్ నాయకత్వాన్ని బలపరుస్తూ వైసీపీ లో చేరారు. మాజీ ఎంపీ వంగా గీత సైతం జగన్ సమక్షంలో వైసీపీ లో చేరారు. వైఎస్సార్ సీపీలో చేరిన అనంతరం ఆదాల ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ… వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే మా లక్ష్యం అన్నారు. వంగా గీత మాట్లాడుతూ…రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం ఖాయమన్నారు. నవరత్నాల ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందని వంగా గీత ఆకాంక్షించారు. అయితే టీడీపీ ప్రభుత్వంపై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. టీడీపీ నాయకులపై గ్రామ గ్రామాల్లో ప్రజల నుండి నిరసన వ్యక్తం ఉంది.దీంతో రాష్ట్ర ప్రజలు జగన్ మోహన్ రెడ్డి కి పూర్తి మద్దతు తెలుపుతున్న విషయాన్ని గ్రహించిన కీలక నేతలు, వైసీపీ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారు.మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ వైసీపీ లో చేరనున్నారు.

అంతేకాదు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక‌ సైతం వైసీపీ లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు.అయితే తాజా చేరికలు, ఆంద్రప్రదేశ్ లో వైసీపీ కున్న ప్రజల మద్దతును తెలియజేయడంతో పాటు, వైసీపీ అధికారం లోకి రానుందనే విషయాన్ని సూచిస్తున్నాయి.వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనుక కుట్ర లను, టీడీపీ హస్తం పై, వైఎస్ జగన్ గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. ఆ తరువాత వైసీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here