టీడీపీవి నయవంచన దీక్షలు!

37

ఈనాలుగేళ్లలో రాష్ట్రాన్ని అన్నివిధాలా సర్వనాశనం చేసి ఇప్పుడు కరువునేలపై దీక్షల పేరుతో టీడీపీ ప్రజలను మోసం చేస్తోందని వైస్సార్సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు.అనంతపురంలో టీడీపీ చేసిన దీక్షను “నయవంచన” దీక్షగా ఆయన అభివర్ణించారు. ఉరవకొండ పట్టణంలోని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తన నివాసంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచి ఇప్పుడు కొత్త డ్రామాలకు చంద్రబాబు తెరలేపారని విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు.ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో ఓట్ల కోసం సీఎం చంద్రబాబు తన పార్టీనేతలతో బూటకపు దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు చేస్తున్న దొంగ దీక్షలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.నాలుగేళ్ల పాటు కేంద్రంతో మిత్రపక్షంగా మెలిగి, ఇద్దరు టీడీపీ ఎంపీలు కేంద్రమంత్రులుగా ఉన్నంత కాలం నోరెత్తకుండా పబ్బం గడిపారని ఆరోపించారు.కనీసం ఏనాడైనా వెనుకబడిన రాయలసీమ ప్రాంత సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించారా బాబు అని నిలదీశారు.ఆఖరుకు వెనుకబడిన ప్రాంత అభివృద్ధి కోసం కేంద్రం కొంత నిధులిస్తే అవి కూడా పక్కదారి పట్టించి అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.కేవలం మీ బలహీనత కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంమోసం చేసిందని ఆరోపిస్తున్నారని ఏపీకి జరిగిన అన్యాయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఉందన్నారు.విభజన హామీలు, హోదా అంశాన్ని తన పోరాటంతో సజీవంగా ఉంచిన వై.యస్ జగన్ ను విమర్శించే నైతిక అర్హత చంద్రబాబు పార్టీకి లేదని విశ్వేశ్వరరెడ్డి అన్నారు.ఇటువంటి వంచనలు చేస్తున్న వారిని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే చెప్పారు.ఈ ప్రెస్ మీట్ లో వైస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here