టీడీపీనే మళ్లీ అధికారంలోకి రాబోతోంది;మంత్రి దేవినేని

174

టీడీపీనే మళ్లీ అధికారంలోకి రాబోతోందని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధీమా వ్యక్తంచేశారు. అన్నివర్గాల ప్రజలు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓట్లు వేశారన్నారు. గతంలో ఎప్పుడు ఇంతటి పోలింగ్ శాతం నమోదు కాలేదన్నారు. పోలింగ్ శాతం పెరగడమే తెలుగుదేశం పార్టీ గెలుపునకు కారణం కాబోతోందన్నారు. తెలంగాణ ఎన్నికల్లో మోదీ.. కేసీఆర్‌కు ఏ విధంగా సహకరించారో… అదే రీతిలో ఈ ఎన్నికల్లో కూడా జగన్‌కు సహకారం అందే ప్రయత్నం చేశారని ఆరోపించారు. గురువారం సాయంత్రం ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ విస్త్రృతస్థాయి సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా సమావేశాల్లో మంత్రి ఉమా మాట్లాడుతూ, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 22న 175 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 25 మంది పార్లమెంట్ అభ్యర్థులతో సమావేశం కానున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు, పోలింగ్ జరిగిన సరళిపై అభ్యర్థులతో చంద్రబాబు చర్చించనున్నట్టు తెలిపారు. వేసవి దృష్ట్యా తాగునీటి పంపిణీని మొదటి ప్రాధాన్యాంశంగా తీసుకొని కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని పిలుపునిచ్చారు. తాగునీరు, పశుగ్రాసం పంపిణీకి రూపొందించిన సమ్మర్‌ యాక్షన్‌ప్లాన్‌పై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారని తెలిపారు. జలవాణి పేరుతో టోల్‌ ఫ్రీ నెంబర్‌ 18004251899 రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంచామని, తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తితే ఆ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే తక్షణమే పరిష్కరిస్తున్నామని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఏమైనప్పటికీ మన అభ్యర్థులను గెలిపించుకునే దిశగా పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేసారు._

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here