టిడిపి-బిజెపి మద్య కొత్త పంచాయతీ

24

తెలుగుదేశం ,బిజెపి మద్య కొత్త పంచాయతీ ఆరంభమైనట్లుగా ఉంది.రాయలసీమ బిజెపి నేతలు ఎపి ప్రభుత్వానికి కొత్త డిమాండ్లు సంధించారు. కర్నూలు లో జరిగిన సమావేశంలో సీమకు సంబందించి డిక్లరేషన్ విడుదల చేశారు. రాయలసీమలో రెండో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయడంతో పాటు నాలుగు జిల్లాలను ఎనిమిదికి పెంచాలని ఈ డిక్లరేషన్‌లో సూచించారు. అలాగే రాయలసీమ అభివృద్ధి బోర్డును పునరుద్ధరించి రాజ్యాంగబద్ధత కల్పించడంతో పాటుగా రూ.10వేల కోట్లు కేటాయించాలని కోరారు.రాయలసీమలో ఆరునెలలకు ఒకసారి అసెంబ్లీ సమావేశాలు నడపాలని కూడా కోరారు. వచ్చే బడ్జెట్‌లో రాయలసీమకు రూ.20వేల కోట్లు కేటాయించాలని పేర్కొన్నారు. 2019కల్లా గాలేరు-నగరి, హంద్రీనీవా, గురు రాఘవేంద్రస్వామి ప్రాజెక్ట్‌లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు సాధనకు కడపలో సమావేశం జరపాలని నిర్ణయించారు.బిజెపిపై టిడిపి విమర్శలు చేస్తున్న నేపద్యంలో బిజెపి నేతలు ఈ డిమాండ్లతో ముందుకు వచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here