టిడిపి నాయకులారా! కడప జిల్లా ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలి – తులసిరెడ్డి

58

వచ్చే ఎన్నికల్లో కడప జిల్లాలో అత్యధిక స్థానాలు గెలిపించేందుకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా టిడిపి నాయకులకు హితబోధ చేయడం హాస్యాస్పదమని కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ధ్వజమెత్తారు.శ్రీబాగ్ ఒప్పందాన్ని గత సాంప్రదాయాన్ని అధికార వికేంద్రీకరణ సూత్రాన్ని కాలరాచి రాజధాని హైకోర్టులలో ఒక్క దానిని కూడా రాయలసీమలో ఏర్పాటు చేయకుండా రాయలసీమకు అన్యాయము చేసినందుకు టీడీపీకి ఓట్లేయ్యాలా.?విభజన చట్టంలోని సెక్షన్ నలభై ఆరు ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుండి రాయలసీమ అభివృద్ధి నిధులు తెప్పించాలని అన్నారు .జిల్లాకు 3500 కోట్ల రూపాయలు  రావాల్సి ఉండగా ,ఇంతవరకూ  150 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయని అన్నారు .విభజన చట్టంలో 13 షెడ్యూల్ ప్రకారం సెయిల్ ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని అన్నారు .

ప్రత్యేక హోదా తేచినందుకా లేక రుణమాఫీ పేరుతో రైతులను మహిళలను మోసం చేసినందుకా, ఉద్యోగాలు, నిరుద్యోగ పేరుతో యువకులను మోసం చేసినందుకు కడప జిల్లా ప్రజలు ఓట్లేయ్యాలా అని ప్రశ్నించారు.వచ్చే ఎన్నికలలో జిల్లాలో ఒక్క సీటు కూడా టిడిపి పార్టీ గెలవలేదని జోష్యం చెప్పారు .పై హామీలన్నీ నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని విభజన హామీలలో పేర్కొన్న వాటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధృవకుమార్రెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నకేశవరెడ్డి మిగిలిన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here