టాలీవుడ్ పెద్దలకు కాంగ్రెస్ డెడ్‌లైన్..?

20

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంపై దుమారం కొనసాగుతోంది. జగన్ ప్రకటనను, జీఎన్ రావు కమిటీ నివేదికను నిరసిస్తూ అమరావతిలో రైతుల ఆందోళనలు జరుగుతున్నాయి. 16 రోజులుగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ సైతం జగన్‌కు వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు నిర్వహించింది. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే ఊరుకోబోమంటూ హెచ్చరించింది. ఐతే రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా తెలుగు సినిమా పరిశ్రమ స్పందించడం లేదంటూ ఏపీ కాంగ్రెస్ మండిపడుతోంది.

ప్రజల టికెట్లతో వందల కోట్లు సంపాదించుకున్న సినీ పెద్దలు, అదే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు స్పందించరని ప్రశ్నిస్తోంది. మూడు రాజధానులపై ఏపీలో ఆందోళనలు జరుగుతున్నాయి. కానీ… సినీ పరిశ్రమ మాత్రం మౌనంగా ఉందంటూ విమర్శలు గుప్పిస్తోంది. మూడు రాజధానులపై సినీ ప్రముఖులు స్పందించాలని ఏపీ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. సినీ ప్రముఖుల మౌనం రాష్ట్ర శ్రేయస్సుకు మంచిది కాదని, తమ హీరోలపై అభిమాన సంఘాలు ఒత్తిడి తీసుకురావాలని సూచించింది. ఈ జనవరి 10వ తేదీ లోపు సినీ ప్రముఖులు స్పందించకుంటే సంక్రాంతికి సినిమాలను ఆడనివ్వబోమని హెచ్చరించింది. సంక్రాంతికి మూడు రోజుల పాటు థియేటర్లు బంద్‌కు పిలునిస్తామని స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here