జ‌గ‌న్ కోసం రస్ అల్ ఖైమా వేట..అందుకే ఢిల్లీ బాట

84

ఏపీ సీఎం జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లారు. ప్ర‌ధాని మోడీని క‌లిశారు. వ‌చ్చారు. ఏపీ ప్ర‌యోజ‌నాలు నెర‌వేర్చాల‌ని విన‌తిప‌త్రం ఇచ్చాన‌ని ప‌త్రికా ప్ర‌క‌ట‌న ఇచ్చారు. మ‌ళ్లీ ఢిల్లీ వెళ్లారు. అమిత్ షాని క‌లిశారు. మోడీకి ఇచ్చిన ప్రెస్ నోట్ మ‌ళ్లీ రిలీజ్ చేశారు. సాక్షి వాళ్లేమో కేంద్రం మెడ‌లు వంచి ప్ర‌త్యేక హోదా తెచ్చే దిశ‌గా చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని రాస్తోంది. ఆంధ్ర‌జ్యోతి ఏమో వాళ్లిద్ద‌రూ మాట్లాడుకుంటే విన్న‌ట్టు జ‌గ‌న్‌ని మోడీ, అమిత్‌షాలు తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టార‌ని రాసింది. అస‌లు విష‌యం మాత్రం ర‌స్ ఆల్‌ఖైమా జైలులో వున్న మ్యాట్రిక్స్ ప్ర‌సాద్ అన‌బ‌డే నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ కి మాత్ర‌మే తెలుసు. మేట‌ర్ చాలా సీరియ‌స్‌. ఇంత‌టి సీరియ‌స్ వ్య‌వ‌హారాన్ని అటు వైకాపా వాళ్లు త‌మ జ‌గ‌న్ దెబ్బ తెలిసి మోడీ, అమిత్‌షాలు బ‌తిమాలుకుతున్నార‌ని సోష‌ల్ మీడియాలో సోపు పోస్టులు పెడుతున్నారు. కేంద్రంలో చేర‌డం జ‌గ‌న్‌కి ఇష్టంలేద‌ని తేల్చేశార‌ని, 4 మంత్రి ప‌ద‌వులు ఆఫ‌ర్ చేశార‌ని పాపం పేటీఎం పోస్టులు వేస్తున్నారు. ఇటు టీడీపీ సానుభూతిప‌రులేమో మోడీ, షాల‌ని బ‌తిమాలుకుని కేంద్రంలో చేరి, కేసుల స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డొచ్చ‌ని ఆలోచిస్తున్నార‌ని రాస్తున్నారు.

ఎక్క‌డో ర‌స్ ఆల్‌ఖైమా దేశంలో నొక్కిన స్విచ్చు ఏపీలో జ‌గ‌న్ అన్న నెట్ వ‌ర్క్ షార్ట్ స‌ర్క్యూట్‌కి కార‌ణం అయ్యింది. అందుకే ఈ మొత్తం ఎపిసోడ్ బ‌య‌ట‌ప‌డ‌కుండా వుండేందుకు చంద్ర‌బాబు మాజీ పీఎస్ ద‌గ్గ‌ర ఏమీ దొర‌క‌క‌పోయినా చంద్ర‌బాబుకు లింక్ చేస్తూ 2 వేల కోట్లు దొరికింద‌ని పుంఖానుపుంఖాను క‌థ‌నాలు వండివార్చుతున్నారు. ఐటీ దాడుల్లోనూ దొరికింది కేసీఆర్ బినామీగా వ్య‌వ‌హ‌రించే బిగ్‌షాట్ శ్రీనివాస్‌. స‌బ్ కాంట్రాక్టులు, జీఎస్టీ ఎగ‌వేత‌ల‌న్నీ ప్ర‌తిమా ఇన్‌ఫ్రా ప‌నే. ఈ ప్ర‌తిమా ఇన్‌ఫ్రా కేసీఆర్ బినామీ అయిన బోయిన‌ప‌ల్లి శ్రీనివాస్ (టీఆర్ ఎస్ ఎంపీ బోయిన‌ప‌ల్లి వినోద్ సోద‌రుడు)ది. ఈ విష‌యం బ‌య‌ట ప్ర‌పంచానికి తెలియ‌కుండా వుండేందుకు జ‌గ‌న్‌, కేసీఆర్ గుప్పిట్లో వున్న మీడియా సంస్థ‌లు టీవీ 9, సాక్షి, టీ న్యూస్‌, ఎన్టీవీ, 10 టీవీలు శ్రీనివాస్ పేరు క‌లిసి రావ‌డంతో మాజీ పీఎస్‌వైపు క‌థ‌నాలు అల్లి ర‌స్ ఆల్ ఖైమా టాపిక్ డైవ‌ర్ష‌న్‌కి పాల్ప‌డ్డారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here