జూలై 10న ఓపెన్ కానున్న సినిమా థియేటర్స్

37

ప్రపంచ వ్యాప్తంగా సినిమా షూటింగులు కూడా ఆగిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. అయితే ఇప్పటికే పలు దేశాల్లో లాక్‌డౌన్‌లో కొన్నింటిని సడలించింది. దీంతో గత కొద్ది రోజుల నుంచి జనాలు రోడ్లపైకి వస్తున్నారు. కొన్ని నిబంధనలతో షూటింగులు కూడా ప్రారంభమయ్యాయి. అలాగే జులై 10 నుంచి థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయని..
ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం సృష్టిస్తోంది కరోనా వైరస్. దీంతో దాదాపు రెండు నెలలకు పైగానే అన్ని దేశాల్లో లాక్‌డౌన్ కొనసాగింది. లాక్‌డౌన్ కారణంగా అన్నీ బంద్ అయిపోయాయి. ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా సినిమా షూటింగులు కూడా ఆగిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. అయితే ఇప్పటికే పలు దేశాలు లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు తీసుకొచ్చారు. దీంతో గత కొద్ది రోజుల నుంచి జనాలు రోడ్లపైకి వస్తున్నారు. కొన్ని నిబంధనలతో షూటింగులు కూడా ప్రారంభమయ్యాయి.
అలాగే జులై 10 నుంచి థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయని విశ్వసనీయ సమాచారం. అయితే అది మన దేశంలో కాదు. అత్యధిక కరోనా కేసులు నమోదైన అమెరికాలో. జులై 10 నుంచి లాస్‌ఏంజిల్స్, న్యూయార్క్ నగరాలలో సినిమా థియేటర్లు ఓపెన్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అన్నీ సరిగ్గా కుదిరితే జులై 10 నుంచి థియేటర్లు ఓపెన్ అవుతాయని అక్కడి వార్తా సంస్థ ట్వీట్ చేయగా.. ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్మ్ రీ ట్వీట్ చేశారు.
కాగా ఇక భారత్‌లో ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో.. థియేటర్స్ రీ ఓపెన్‌కు కేంద్రం నిరాకరించింది. జన సమూహం ఎక్కువగా ఉండటం, కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో థియేటర్లకు, విద్యా సంస్థలకు అనుమతులు ఇవ్వలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here