జులై 29 న "ది బి ఎఫ్ జి" చిత్రం విడుదల

118

 

OneSheet_ƒTelugu_REL copy

జురాసిక్ పార్క్ , జాస్, ఇండియానా జోన్స్ వంటి అద్భుతమైన చిత్రాల రూపకర్త స్టీవెన్ స్పిఎల్బర్గ్ దర్శకత్వం లో వస్తోన్న అద్భుతమైన ఫాంటసి చిత్రం, ” ది బి ఎఫ్ జి (ది బిగ్ ఫ్రెండ్లీ జయంట్)”. డిస్నీ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని జులై 15 న దేశ వ్యాప్తం గా రిలయన్స్ వారు విడుదల చేయనున్నారు .

ప్రముఖ తెలుగు నటుడు జగపతి బాబు ఈ చిత్రం లో ని ప్రధాన పాత్రకు డబ్బింగ్ చెప్పటం విశేషం. ఆయన ఒక పాత్రకు డబ్బింగ్ చెప్పటం ఇదే ప్రధమం. “స్టీవెన్ స్పిఎల్బర్గ్ వంటి దిగ్గజం దర్శకత్వం వహించిన చిత్రం లో ఒక పాత్రకు నా గాత్రం ఉండటం ఎంతో ఆనందం గా ఉంది.హిందీ లో అమితాబ్ గారు డబ్బింగ్ చెప్పారు. ఈ అవకాశం ఇచ్చిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ కి థాంక్స్” అని ఆయన అన్నారు.

ఒక ఫ్రెండ్లీ మహాకాయుడికి ఒక చిన్న పిల్లకి మధ్య జరిగే ఒక అద్భుతమైన కథను స్టీవెన్ స్పిఎల్బర్గ్ అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం తో తెరకెక్కించారు. భారీ బడ్జెట్ ,అబ్బురపరిచే గ్రాఫిక్స్ మరియు ఆకట్టుకునే కథనం ఈ “ది బి ఎఫ్ జి” చిత్రానికి హైలైట్ అని రిలయన్స్ అధికార ప్రతినిధి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here