జిల్లాలో నీటి సమస్యలను తీర్చేదిశగా అడుగులు

306

జిల్లాలను ప్రధానంగా పట్టిపీడిస్తున్న నీటి సమస్కరమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నమాని రాష్ట్ర విధ్యులత్‌, అటవీ,పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖా మాత్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కోన్నారు. స్ధానిక ఎన్‌.ఎస్‌.పి విశ్రాంతి గృహం నందు ఆదివారం వివిధ శాఖల అధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర విధ్యులత్‌, అటవీ,పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి బాలినేనితోపాటు విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ పాల్గొన్నారు. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొట్టమెదటి సారిగా వివిధ శాఖల జిల్లా అధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. తొలుత సమావేశంలో జిల్లాకు సంబందించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  భవిష్యత్‌లో ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించనున్న సేవలను పారదర్శకంగా జరిగేలా భాద్యతాయుతంగా వ్యవహరించాలని తెలియజేశారు. అధికారులకు పలు సూచనలను ఇరుమంత్రులు అందించారు. అనంతరం విలేఖరులతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్ళ నుండి జిల్లా ప్రజలు కరువ కాటకాలతో అల్లడుతున్నారన్నారు. ప్రధానంగా జిల్లాను నీటి కొరత వేదిస్తున్న అంశంగా ముందువరుసలో ఉందన్నారు. పశ్చిమ ప్రాంత అభివృద్దికై వెలుగొండ ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రారంభించిన సంగతి గుర్తుచేవారు. గత ప్రభుత్వం ప్రదాన సమస్యలను గాలికొదిలేని ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టిందని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ పూర్తితో పశ్చిమ ప్రాంతంలో అన్ని సమస్యలకు పరిష్కారం దొరకనుందని వివరించారు. గత ప్రభుత్వం మాదిరిగా అబద్దపు వాగ్దానాలు చేసి ప్రజలను మోసగించే పనులు మేము చేయబోమని, వెలుగొంగ ప్రాజెక్ట్‌ జగన్‌తోనే సాధ్యమని అతి త్వరలో సంబందిత మంత్రి ద్వారా అక్కడి పరిస్ధితులు రివ్యూ చేయించి అతి త్వరలో వెలుగొండ పూర్తికి కృషిచేస్తామని హామి ఇచ్చారు.

ఇక మున్సిపాలిటీల పరిధిలోని అర్బన్‌, రూరల్‌ ప్రాంతాలలో త్రాగునీటి సమస్య ఒక సవాలుగా తయారైయిందన్నారు. అయినప్పటికి నాలుగురోజులకు ఒకసారి ప్రజలకు నీటి విడుదల చేస్తున్నామన్నారు. ఒంగోలులోను అదే పరిస్ధితి నెలకొందన్నారు. గత ప్రభుత్వా ప్రజాప్రతినిధి అభివృద్ధిపేరుతో ఒంగోలులో   బారీ అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. కాంట్రాక్టర్ల దగ్గర నుండి పర్సంటేజీలు మింగేసి రోడ్లుమీద రోడ్లు వేసి అభివృద్ది చేస్తున్నామంటూ ప్రజలు మభ్యపెట్టారన్నారు. ఏడుగుండ్లపాడు ద్వారా ఒంగోలుకు పైప్‌ లైన్‌ వేసి నీరు తేచ్చే పధకంలో రూ.72 కోట్లు మున్పిపాటిటి వాటాగా చెల్లించాల్సి ఉండాగా ఇంతవరకు ఒక్క రూపాయికూడా చెల్లింలేదన్నారు. ప్రస్తుత పరిస్ధితులలో మున్సిపాలిటి అంత డబ్బును చెల్లించే స్ధితిలో లేదన్నారు. ముఖ్యంత్రి వై.ఎస్‌. జగన్‌ దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్ళి ఏడుగుండ్ల పాడు నుండి పైపులైన్‌ను త్వరలో పూర్తిచేసి ఒంగోలుకు నీటి సమస్యను తీర్చుతానని హామి ఇచ్చారు. రూరల్‌ ప్రాంతాలలో నీటిని అందించేదుకు ఆర్‌.డబ్ల్యూ.ఎస్‌ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరాను అందిస్తున్నామని ఇందుకుగాను 48 కోట్లు ఆర్‌.డబ్ల్యూ.ఎస్‌కు ఫండ్స్‌ రిలీజ్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంత్రి జగన్‌ దృష్టికి తీసుకువెళ్లి త్వరలో ఆ మొత్తాన్ని రిలిజ్‌ చేయనున్నట్లు తెలియజేశారు. రామయపట్నం పోర్టు, దొనకొండ ఇండ్రస్ట్రీయల్‌ కారిడార్‌, కనిగిరి నందు ఎయియ్స్‌ను త్వరలో ప్రారంభించేందుకు  కృషిచేస్తామన్నారు.  రైతులకు పగటిపూట తొమ్మిది గంటల కరెంటును అందించేందుకు ప్రణాళిక తయారుచేశామన్నారు. ముందుగా రాష్టంలోని 60 శాతం గ్రామాలలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు తెలియపారు. అనంతరం విధ్యుత్‌ను సరఫరా చేయుటలో ఏదురైయ్యేటువంటి సమస్యలులను అధిగమించి పూర్తి స్ధాయిలో రైతులకు మేలు జరిగేలా రాష్ట్ర మొత్తం అమలుచేయనున్నామన్నారు. రాష్ట్రంను అన్ని విదాల అభివృద్ది పరిచేందుకు ప్రధాన మంత్రి మోడిసైతం తమ వంతు సయాన్ని అందించేందుకు సిద్దంగా ఉన్నామని ఇటీవల తిరుపతి వచ్చిన సందర్భంగా రాష్ట్రముఖ్యంత్రి వై.ఎస్‌. జగన్‌కు హాచ్చారని ఆయన అన్నారు.

అనంతరం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ ప్రదానంగా జిల్లా కు సంబందించి ట్రిపుల్‌ఐటి, ప్రకాశం యూనివస్సిటి, డిఎస్సీ అను మూడు అంశాలు ఉన్నాయన్నారు. దివంగత రాజశేఖరెడ్డి ప్రతిష్టత్మకమైన ట్రిపుల్‌ ఐటి ని రూపకల్పన చేశారని గుర్తుచేశారు.ఇడుపులపాయలో గత మూడు సంవత్సరాల నుండి ట్రిపుల్‌ ఐటి ఇడుపులపాయలో నిర్వహించడుతుందని ప్రతి సంవత్సరం వేయ్యు మం

ది విద్యార్ధులు అక్కడ అడ్మిషన్లు పొందుతున్నారని తెలియజేశారు. ఇప్పటికి అక్కడ మూడువేల మంది విద్యార్ధులు  సరైన వసతులు లేక నరకయాతన పడుతున్న పరిస్ధితి ఉందన్నారు. గత ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కార దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. ఒంగోలుకు సంబందించి ఈ సంవత్సరం అద్దె భవనాలలోనైనా ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్దంచేశామన్నారు. ముందు ఒంగోలు రామ్‌అండ్‌ నాయుడు కాలేజీని ఎంపికలో తీసుకున్నాప్పటికి అది ఒక్క బ్యాచ్‌కు మాత్రమే సరిపోతుందని అనంతరం అడ్మిషన్లు పొందిన విద్యార్ధులకు మరో చోటు ఏర్పాటుచేయవలసి వస్తుందన్నారు. కావున తాత్కాలికంగానైనా సరే విద్యార్ధులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా ఒక శాశ్వత ప్రాతిపధికన కనీసం మూడు సంవత్సరాలు సరిపోయేటుంవంటి భవనాన్ని అన్వేషించి ఈ సంవత్సరమే ట్రిపుల్‌ ఐటి ని ప్రారంభిస్తున్నామన్నారు. ట్రిపుల్‌ ఐటిని తిరిగి ఒంగోలుకు తీసుకురావడానికి తీవ్ర కృషిని చేస్తున్నామన్నారు.  ప్రకాశం యూనివర్సిటీకి సంబందించి యూనివర్సిటి యాక్ట్‌ నందు కొన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వాలు అవీవి పట్టకుంబా ప్రజలకు మభ్యపెట్టేందుకు చేసే శంఖుస్ధాపనలు, శిలాఫలకాలు సమాధి బండలను తలపిస్తున్నాయాని ఎద్దేవాచేశారు. చట్టవసరసలు అనంతరం రాబోయేటువంటి బజ్జట్‌ సమావేశాలలో దీనిని ప్రవేశపెట్టి దానికి కావలసిన అన్ని వనరులు సమకూర్చి త్వరలోనే యూనివర్సిటి భవనాలు పూర్తిచేసి అందించేవిధంగా ప్రయత్నిస్తానన్నారు. డిఎస్సీకి సంబందించి గత ప్రభుత్వం వారే అంతా పూర్తిచేశారని ఎన్నికలు రావడం మూలాన నియామకాల ప్రక్రియ కొంత ఆలస్యమైయిందన్నారు. నియామక ప్రక్రియగురించి అధికారులు ముందుగానే ఆదేశాలు జారీచేశామన్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటుచేసి వారంరోజులలో జిల్లాల వారిగా సర్టిఫికేట్లు వెరిఫికేషన్‌ చేసిన అనంతరం రోస్టర్‌ ఆదారంగా వారికి త్వరలోనే అపాయింట్‌మెంట్‌ ఆర్టర్లు అదజేస్తామని తెలియజేశారు.

అమ్మవడి పథకం ద్వారా కార్పోరేట్‌ పాఠశాలలకు లభ్ది చేకూరుతుందని సోషల్‌ మీడియాలో వస్తున విమర్శల గురించి పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు విద్యాశాఖ మంతి సురేష్‌  స్పందిస్తూ వై.ఎస్‌. జగన్‌ ప్రభుత్వంలో  ఎన్నికల హామీలైన నవరత్నాలకు పెద్దపీట వేయడం జరిగిందన్నారు. ఈ పధకాన్ని కేవలం ఈ నవరత్నాలలో భాగంగా గుర్తించాలన్నారు. అమ్మవడి అనేటువంటిది తమ బిడ్డను బడికి పంపిచే పిల్లలకు, తల్లికి కలిపి పదిహేనువేల రూపాయలు ఇవ్వడమనేని కార్పోరేట్ల కోసం కాదన్నారు. నవరత్నాలలో ఉన్నటువంటి ముఖచిత్రాన్ని మారుస్తాం అనే అంశాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నవత్నలకు ఒక మానిటరింగ్‌ కమిటీ ఉంటుందని దాని ద్వారా నవరత్నాలు అమలుచేయబడతాయన్నారు. రాబోమే రోజులలో నూతన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టనున్నామన్నారు. దీనికి సంబందిచిన ఒక ముసాయిదా పత్రాన్నికూడా తయారుచేసి ముఖ్యమంత్రికి పంపడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నలబైవేల ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్‌ పాఠశాలల కన్నా ధీటుగా తీర్చిదిద్దుతామాన్నారు. అంతేకాంకుండా అధిక ఫీజులు వసూలుచేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై కఠన చర్యలు తీసుకునే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే చేపట్టబోతున్నామని తెలియజేశారు.

సమావేశంలో జిల్లా కలెక్లర్‌  పోలా భాస్కర, జాయింట్‌ కలెక్టర్‌ నాగలక్ష్మీ, జాయింట్‌  కలెక్టర్‌-2 డాక్టర్‌ ఎ. సిరి, జిల్లా రెవిన్యూ అదికారి వెంకటసుబ్బయ్య, ఇరిగేషన్‌, ఆర్‌.డబ్ల్యు,ఎస్‌ పబ్లిక్‌ హెల్త్‌ అధికారలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here