జవాబుదారి తనంతో పనిచేయండి;మంత్రి బాలినేని

122

గ్రామ సచివాలయ నియామకాల్లో భాగంగా విద్యుత్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఎనర్జీ అసిస్టెంట్ (జూనియర్ లైన్మెన్ గ్రేడ్.2
పరీక్షలు ఇటీవల ప్రభుత్వం చేపట్టింది.13 జిల్లాలో 7885 మంది జె.ఎల్.ఎం.లు గా ఎంపికైనారు.ఫలితాలు విద్యుత్
శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
సోమవారం ఒంగోలు లో విడుదల
చేశారు.
ఈ సందర్భంగా మంత్రి బాలినేని
మాట్లాడుతూ నియామక ప్రక్రియ
పారదర్శకంగా పూర్తి చేసినందుకు
అధికారులను అభినందించారు.
సి.ఎం జగన్మోహన్ రెడ్డి గారి
ఆకాంక్ష మేరకు నియామకాలు
చేపట్టామన్నారు.రాష్ట్రం లో
నిరుద్యోగ సమస్య పారద్రోలడానికి
ముఖ్యమంత్రి కృత నిశ్చయంతో
ఉన్నారన్నారు.ఇందులో బాగంగా నే పెద్దఎత్తున విద్యుత్ శాఖ లో జె.ఎల్.ఎం నియామకాలు జరిగాయని తెలిపారు.
ఎపికైనవారు క్రమశిక్షణ, నిజాయితీ
గా విధులు నిర్వర్థించి ప్రభుత్వానికి
మంచి పేరు తేవాలని సూచించారు.
ఎంపికైన వారి వివరాలు
WWW.apspdcl.in
WWW.apepdcl.in
వెబ్ సైట్ లో అందుబాటులో
ఉన్నాయని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమం లో ప్రకాశం జిల్లా
కలెక్టర్ పోలా భాస్కర్,ఎస్పీ
సీదార్డ్ కౌశల్,ఎస్.ఈ సుబ్బరాజు
అధికారులు పాల్గొన్నారు.
కుమార్
పి.ఆర్.ఓ
(విద్యుత్/అటవీశాఖ మంత్రి)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here