జన్మభూమి మా ఊరు బ్రహ్మాండమైన సక్సెస్ అయింది;సీఎం

72

2019 జన్మభూమి లో మొత్తం 5,65,616 ఫిర్యాదులు, వినతులు రాగా, అందులో 33,888 పరిష్కారం అయిపోయాయి సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పేదరికం నిర్మూలన, పెన్షన్లు, ఇళ్ల స్థలాలపై ఎక్కువ శాతం వినతులు వచ్చాయి. ప్రజల సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్నాం. సమస్య పరిష్కారం అయ్యిందీ లేనిదీ ప్రజలకు లేఖలు రాసి తెలియపరుస్తున్నాం. ఏ ఒక్క వ్యక్తికి నష్టం కలుగకుండా ప్రయత్నం చేస్తున్నాం. ఈ తరహా వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా అమలులో లేదు. జన్మ భూమి మా ఊరు బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. ఆర్టీజీఎస్, పరిష్కార వేదిక,ఈ ప్రగతి అనుసంధానం తో ఆరో జన్మభూమి విజయవంతం అయింది. ప్రభుత్వ పనితీరుపై జన్మభూమిలో ప్రజల నుంచి సంతృప్తి వచ్చింది. పారదర్శకంగా పనిచేయడం వల్లే జన్మభూమి గ్రామసభల్లో గొడవలు చేయాలనుకునేవారు ఏమీ చేయలేకపోయారు. వయాడక్ట్ అనే కాన్సెప్ట్‌ను అన్నిస్థాయిలలో అమలు చేయడానికి జన్మభూమి స్పూర్తినిచ్చింది. లక్షా 28 వేల మంది అధికారులు ఈ కార్యక్రమంలో పనిచేశారు.10 రోజుల్లో అన్ని గ్రామాలలో గ్రామసభలు నిర్వహించాం. 12లక్షలకు పైగా ఆరోగ్య శిబిరాలలో పాల్గొన్నారు. రాష్ట్రంలో సంక్రాంతి జనవరి 1 నుంచే ప్రారంభమయ్యింది. పది థీమ్‌లు తీసుకున్నా. 10 శ్వేత పత్రాలపై విస్తృతంగా చర్చ జరిగింది. దేశానికే ప్రణాళిక లేని ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామస్థాయిలో ప్రణాళికలను రూపొందించడం విశేషం.ఈ జన్మభూమి లో మొత్తం 5,65,616 ఫిర్యాదులు, వినతులు రాగా, అందులో 33,888 పరిష్కారం అయిపోయాయి. పేదరికం నిర్మూలన, పెన్షన్లు, ఇళ్ల స్థలాలపై ఎక్కువ శాతం వినతులు వచ్చాయి. ప్రజల సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్నాం. సమస్య పరిష్కారం అయ్యిందీ లేనిదీ ప్రజలకు లేఖలు రాసి తెలియపరుస్తున్నాం. ఏ ఒక్క వ్యక్తికి నష్టం కలుగకుండా ప్రయత్నం చేస్తున్నాం. ఈ తరహా వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా అమలులో లేదు. రెండు చేతులూ లేనివారికి వారికి నెలకు 10 వేలు పెన్షన్ ఇస్తాం. సుమారు 200 నుంచి 300 మంది ఉండవచ్చు అన్ని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here